గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 18 ఏప్రియల్ 2023 (19:01 IST)

మంచు మనోజ్- భూమా మౌనిక వెడ్డింగ్ సాంగ్.. ఏం మనసో .. ఏం మనసో..

Manoj
మంచు మనోజ్- భూమా మౌనిక వివాహం ఇటీవల జరిగింది. కుటుంబ సభ్యులతో పాటు వీరి వివాహానికి కొంతమంది సినీ ప్రముఖులు హాజరయ్యారు. ఈ నేపథ్యంలో ఈ పెళ్లి వేడుకకు సంబంధించిన కొన్ని ముఖ్యమైన ఘట్టాలను వీడియో సాంగ్ రూపంలో రిలీజ్ చేశారు.
 
"ఏం మనసో .. ఏం మనసో" అంటూ అనంత శ్రీరామ్ రాసిన పాటకి అచ్చు రాజమణి ట్యూన్ చేయడమే కాకుండా, ఆయనే ఈ పాటను ఆలపించారు. 
 
పెళ్లికి సంబంధించిన దృశ్యాలను ఈ పాటపై కట్ చేశారు. తలంబ్రాలు పోసుకోవడం, అరుంధతి నక్షత్రం చూపించడం, పెద్దల ఆశీస్సులు మొదలైన దృశ్యాలపై ఈ పాట సాగింది. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.