శనివారం, 4 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్

ఆ వీడియో గురించి నా కంటే ఆ చానెల్‌కే బాగా తెలుసు : మంచు మనోజ్

manchu manoj
మంచు ఫ్యామిలీలోని అన్నదమ్ముల మధ్య ఉన్న విభేదాలు ఇటీవల బయటపడిన విషయం తెల్సిందే. దీనికి సంబంధించి ఒక వీడియో వెలుగులోకి వచ్చింది. ఇది మీడియాలో పెను సంచలనంగా మారింది. సినీ నటుడు మంచు మోహన్ బాబు సైతం తన ఇద్దరు కుమారులపై మండిపడ్డారు. మందలించారు. ఈ వీడియోను డిలీట్ చేయాలంటూ మంచు మనోజ్‌ను కోరారు. ఈ వివాదంపై మంచు మనోజ్ తాజాగా స్పందించారు.
 
ఆ వీడియో గురించి తనకంటే ఆ చానల్‌కే మరింత తెలుసని, వాళ్ళను అడిగితే చాలా విషయాలు చెబుతారని వ్యంగ్యం ప్రదర్శించారు. ఇక ఈ వీడియో గురించి నన్ను అడగొద్దు అంటూ తనదైనశైలిలో బదులిచ్చారు. తన సోదరుడు మంచు విష్ణు బంధువుల ఇళ్లపై ఇలా దాడులు చేస్తుంటాడు అని మంచు మనోజ్ విడుదల చేసిన చేసిన వీడియోలో బ్యాక్‌గ్రౌండ్ వాయిస్ ఉన్న విషయం తెల్సిందే. దీనిపై మంచు మనోజ్ తాజాగా వివరణ ఇచ్చారు.