ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 17 ఏప్రియల్ 2023 (18:44 IST)

కాజల్ కుమారుడి పుట్టినరోజు.. సూపర్ వీడియో విడుదల

Kajal agarwal
Kajal agarwal
టాలీవుడ్ నటి, అందాల ఐకాన్ కాజల్ అగర్వాల్ తన కుమారుడు నీల్ కిచ్లు వీడియోను పంచుకున్నారు. నీల్ కిచ్లు ఏప్రిల్ 19న తన మొదటి పుట్టినరోజును జరుపుకోబోతున్నాడు. 
 
ఈ సందర్భంగా కాజల్ ఓ స్పెషల్ వీడియోను విడుదల చేసింది. అయితే, ఆమె పోస్ట్‌లో తన కొడుకు ముఖాన్ని బయట ప్రపంచానికి చూపెట్టలేదు. ఈ వీడియోకు కాజల్ అభిమానులు, నెటిజన్లు ఆమె పోస్ట్‌కు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. నటి కాజల్ అగర్వాల్- ఆమె వ్యాపారవేత్త భర్త గౌతమ్ కిచ్లు వచ్చే ఏడాది ఏప్రిల్‌లో కొడుకు నీల్‌కు స్వాగతం పలికారు.
 
ప్రసూతి విరామం తర్వాత, కాజల్ అగర్వాల్ రీ-ఎంట్రీ కమల్ హాసన్ ఇండియన్-2తో పెద్ద తెరపైకి తిరిగి రావడానికి సిద్ధంగా ఉంది. ఈ చిత్రం 1996 బ్లాక్ బస్టర్ ఫిల్మ్ ఇండియన్‌కి సీక్వెల్. ఈ సినిమాలో తన వంతుగా మార్షల్ ఆర్ట్స్, గుర్రపు స్వారీ నేర్చుకుంటోంది కాజల్ అగర్వాల్.