ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 1 ఏప్రియల్ 2023 (12:32 IST)

హిందీ సినిమా ఇండస్ట్రీపై కాజల్ అగర్వాల్ సెన్సేషనల్ కామెంట్స్

Kajal Aggarwal
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్‌ హిందీ సినిమా ఇండస్ట్రీపై చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం బాలీవుడ్‌లో కాకుండా సౌత్‌లో పనిచేయడానికి ఎందుకు ఇష్టపడతానో వెల్లడించింది. 
 
దక్షిణాది, హిందీ చిత్ర పరిశ్రమల మధ్య వ్యత్యాసాలను చర్చిస్తున్నప్పుడు, కాజల్ అగర్వాల్ దక్షిణ భారత పరిశ్రమలోని పర్యావరణ వ్యవస్థ, విలువలు, నైతికత, క్రమశిక్షణను ఇష్టపడతానని వెల్లడించింది. 
 
అది బాలీవుడ్‌లో లేదని తాను భావిస్తున్నానని కాజల్ అగర్వాల్ పేర్కొంది. భాషాభేదాలకు అతీతంగా టాలెంట్ ఉన్న ప్రతి ఒక్కరినీ దక్షిణాది సినిమా స్వాగతిస్తుందని చెప్పింది. ఆ స్నేహబంధం బాలీవుడ్‌లో లేదు. ఈ ప్రకటన సోషల్ మీడియాను రెండు గ్రూపులుగా విభజించడానికి కారణమైంది. 
 
కొంతమంది కాజల్ అగర్వాల్‌ను బోల్డ్ స్టేట్‌మెంట్ కోసం ట్రోల్ చేయగా, మరికొందరు ఆమెకు మద్దతు ఇచ్చారు. రైజింగ్ ఇండియా సమ్మిట్ 2023లో బాలీవుడ్‌పై కాజల్ అగర్వాల్ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్‌గా మారాయి. ప్రస్తుతం కాజల్ అగర్వాల్- కమల్ హాసన్ శంకర్ ఇండియన్ 2తో పాటు బాలకృష్ణ NBK 108లో కనిపించనుంది.