1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
  4. The priest beating the coconuts in the hands of the devotees without missing

ఆ కొబ్బరికాయలు కొట్టుడేందన్నా? చూస్తుంటే నరాలు కట్ అవుతున్నాయి- video

breaking coconuts
సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక ఎక్కడ ఏమి జరిగినా చిటికెలో షేర్ చేసేస్తున్నారు. మరీ ముఖ్యంగా విశేషమైనవి, ఆకట్టుకునే వీడియోలు వుంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వదలడంలేదు. ఇక అసలు విషయానికి వస్తే... ఆలయ ప్రాంగణంలో ఓ ఉత్సవానికి సంబంధించిన వీడియో ట్విట్టర్లో హల్చల్ చేస్తోంది.
 
ఆ వీడియోలో అమావాస్య పూజ సందర్భంగా ఆలయం వద్ద కొబ్బరికాయలు కొట్టేందుకు భక్తులు బారులుతీరారు. కొబ్బరికాయలను చేతుల్లో పట్టుకుని నిలబడి వున్నారు. ఓ పూజారి ఓ ఇనుప రాడ్డును పట్టుకుని భక్తుల చేతుల్లోని కొబ్బరికాయలను దెబ్బకి పగలగడొతూ ఎంతో వేగంగా వెళ్లిపోతున్నారు. పొరబాటును కొబ్బరికాయ మీద పడే దెబ్బ మిస్ అయితే ఏమవుతుందోనన్న భయం చూసినవారందరికీ కలుగుతుంది. ఆ వీడియో మీరూ చూడండి.
About Writer
ఐవీఆర్
తర్వాతి కథనం
జనసేన పార్టీ వీడిన పోతిన మహేష్... కారణం మాత్రం అదే?