బుధవారం, 8 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By వరుణ్
Last Updated : సోమవారం, 8 ఏప్రియల్ 2024 (15:28 IST)

కుమార్తె ప్రియుడిని పెళ్లి చేసుకుందనీ.. అశ్రునివాళి పోస్టర్లు ముద్రించిన కన్నతండ్రి... ఎక్కడ?

anushna
తాము అల్లారుముద్దుగా పెంచుకున్న కన్నబిడ్డ తాను ప్రేమించిన ప్రియుడితో వెళ్లిపోయి ఓ గుడిలో ప్రేమ వివాహం చేసుకుంది. ఈ విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు బోరున విలపించసాగారు. ఈ వివాహాన్ని జీర్ణించుకోలేకపోయారు. తన కుమార్తె చనిపోయిందని ప్రచారం చేయడమేకాకుండా, అశ్రునివాళి పోస్టర్లు కూడా ముద్రించారు. ఇంటి ముందు గోడకు ఫ్లెక్సీని అతికించి తన ఆవేదనను సోషల్ మీడియాలో పంచుకున్నారు. మరో తండ్రికీ ఇలాంటి కష్టం రాకూడదని, అయ్యలారా.. అమ్మలారా జాగ్రత్తగా మీ పిల్లలను కాపాడుకోండని విజ్ఞప్తి చేశఆడు. బిడ్డలారా మీరు మోసపోవద్దు... మీ తల్లిదండ్రులకు గుండెకోత మిగల్చవద్దంటూ కన్నీటిపర్యంతమయ్యాడు. ప్రతి ఒక్కరి కంట కన్నీరు పెట్టిస్తున్న ఈ ఘటన తెలంగాణ రాష్ట్రంలోని రాజన్న సిరిసిల్ల జిల్లాలో జరిగింది. 
 
జిల్లాకు చెందిన చిలువేర అనూష్ణ అనే యువతి బీటెక్ మొదటి సంవత్సరం చదువుతుంది. ఆమెను తల్లిదండ్రులు అల్లారుముద్దుగా పెంచుకున్నారు. ఒకే కుమార్తె కావడంతో చిన్నప్పటి ఎంతో ప్రేమగా పెంచుకున్నారు. పైగా, మంచి విద్యావంతురాలిని చేయాలని భావించి మంచి పేరున్న కాలేజీలో బీటెక్ చదివిస్తున్నారు. ఈ క్రమంలో అనూష్ణ ఓ యువకుడి ప్రేమలో పడింది. ఈ విషయం ఇంట్లో తెలియడంతో తల్లిదండ్రులు ఆమెకు నానా విధాలుగా నచ్చజెప్పారు. భయపెట్టారు. కానీ, ఆ యువతి మాత్రం ఇవేమీ పట్టించుకోకుండా ఇంట్లో నుంచి వెళ్లిపోయి, ఓ దేవాలయంలో ప్రియుడిని వివాహం చేసుకుంది. 
 
కూతురు చేసిన పనికి ఆ తండ్రి ఆగ్రహంతో ఊగిపోయాడు. మాయమాటలకు తన బిడ్డ మోసపోయిందని ఆవేదన చెందాడు. ఆపై తన బిడ్డ చనిపోయిందంటూ బంధుమిత్రులకు సమాచారం ఇచ్చాడు. అశ్రునివాళి పేరుతో ఓ ఫ్లెక్సీ ప్రింట్ చేయించి తన ఇంటి ముందు గోడకు అతికించాడు. ఆ ఫ్లెక్సీ పక్కనే కూర్చుని మోసగాళ్లు చెప్పే మాయమాటలను నమ్మి తన బిడ్డలాగా చేయొద్దంటూ అమ్మాయిలకు ఆవేదనతో విజ్ఞప్తి చేశాడు. ఈ వీడియో ఇపుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.