శుక్రవారం, 23 ఫిబ్రవరి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ ఎన్నికలు 2023
Written By సెల్వి
Last Updated : ఆదివారం, 3 డిశెంబరు 2023 (11:47 IST)

గాంధీభవన్ వద్ద ఫ్లెక్సీలు కలకలం..

congressflags
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడనున్న తరుణంలో గాంధీభవన్ వద్ద ఫ్లెక్సీలు కలకలం సృష్టిస్తున్నాయి. కౌంటింగ్ ప్రక్రియ ఇప్పుడిప్పుడే ప్రారంభమైన తరుణంలో ఇలాంటివి వెలుగులోకి రావడం రాజకీయంగా ఆసక్తికరంగా మారింది. 
 
ముందుగా తెలంగాణలో పార్టీ విజయంపై హర్షం వ్యక్తం చేస్తున్న కాంగ్రెస్ పార్టీ అధినేతలు సోనియా గాంధీ, మల్లిఖార్జున ఖర్గే అంటూ హెడ్డింగ్ పెట్టి ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు.
 
తెలంగాణ ఓటర్లకు వందనాలు, అభివందనాలు చెబుతున్న రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ అని ప్రచురించారు. ఓటర్లలకు రేవంత్ రెడ్డి కృతజ్ఞతలు చెబుతున్నట్లు పేర్కొన్నారు. 
 
ఈ ఫ్లెక్సీని వేరంగుల రమేష్ బాబు అనే వ్యక్తి ఏర్పాటు చేసినట్లు అతని పేరుతో పాటూ మరో ఇద్దరి పేర్లు ముద్రించారు.