సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : గురువారం, 25 మే 2023 (21:07 IST)

గాంధీ భవన్ దగ్గర టెన్షన్ టెన్షన్... ఛలో సెక్రటేరియట్‌.. కాంగ్రెస్ నేతల అరెస్ట్

Gandhi Bhavan
Gandhi Bhavan
కొత్త సెక్రటరియేట్ భవనం‌లో జరిగిన అగ్ని ప్రమాదాన్ని పరిశీలించేందుకు కాంగ్రెస్ నాయకులు ఛలో సెక్రటేరియట్‌కు పిలుపునిచ్చారు. సమాచారం అందుకున్న పోలీసులు గాంధీభవన్ దగ్గర మోహరించారు. ఛలో సెక్రటేరియట్‌కు అనుమతి లేదని కాంగ్రెస్ నేతలను అడ్డుకున్నారు. దీంతో గాంధీ భవన్ దగ్గర ఉద్రిక్తత చోటుచేసుకుంది. 
 
పరిస్థితిని అదుపులోకి తీసుకునేందుకు కాంగ్రెస్ నేతలను బయటికి రాకుండా గాంధీభవన్ లోనే హౌస్ అరెస్ట్ చేశారు. ఇంకా మల్లు రవి, అంజన్ కుమార్ యాదవ్‌లను అదుపులోకి తీసుకున్నారు.  అలాగే బయట వున్న కార్యకర్తలను వెలుపలి నుంచి వెళ్లగొట్టారు.