1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
  4. Road Accident in Medak, Four Dies

మెదక్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురి మృతి

road accident
తెలంగాణ రాష్ట్రంలోని మెదక్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆటోను వెనుక నుంచి వచ్చిన కారు బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో నలుగురు మృతిచెందగా మరో ఇద్దరు గాయపడ్డారు. ఆర్మూర్‌ మండలం ఆలూరుకు చెందిన ఆరుగురు గజ్వేల్‌కు ఆటోలో వెళ్తున్నారు. మార్గంమధ్యలో నార్సింగి మండలం వల్లూరు అటవీ ప్రాంతానికి చేరుకునే సరికి ఆ ఆటోను వెనుక నుంచి వేగంగా వచ్చిన కారు అదుపుతప్పి ఢీకొట్టింది. 
 
ఈ ప్రమాదంలో ఆలూరుకు చెందిన శేఖర్‌ (45), యశ్వంత్‌ (11), గజ్వేల్‌కు చెందిన వృద్ధ దంపతులు మాణెమ్మ(60), బాలనర్సయ్య(65) అక్కడికక్కడే మృతి చెందారు. ఆటోలో ప్రయాణిస్తున్న కవిత, అవినాశ్‌ తీవ్రంగా గాయపడ్డారు. 
 
ప్రమాదానికి కారణమైన కారు డ్రైవర్‌ ఈ ఘటన జరిగిన తర్వాత పారిపోయాడు. సమాచారం అందుకున్న నార్సింగి ఎస్సై నర్సింగులు, చేగుంట ఎస్సై ప్రకాశ్‌గౌడ్‌ ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాలను రామాయపేట ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 
About Writer
వరుణ్
తర్వాతి కథనం
దొంగలో మార్పు తెచ్చిన భగవద్గీత... చోరీ చేసిన నగలను తిరిగిచ్చేశాడు..