సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వరుణ్
Last Updated : బుధవారం, 17 మే 2023 (08:23 IST)

పల్నాడు దాచేపల్లిలో రోడ్డు ప్రమాదం - ఐదుగురు కూలీల దుర్మరణం

road accident
ఏపీలోని పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం పొందుగల వద్ద బుధవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఐదుగురు కూలీలు మృత్యువాతపడ్డారు. మరో పది మంది తీవ్రంగా గాయపడ్డారు. వీరందరూ నల్గొండ జిల్లాకు చెందినవారే. 
 
గురజాల మండలం పులిపాడుకు వెళ్తుండగా వీరి ఆటోను ఎదురుగా వచ్చిన ఓ లారీ బలంగా ఢీకొట్టింది. ప్రమాదం జరిగిన సమయంలో ఆటోలో ఏకంగా 23 మంది కూలీలు ఉన్నారు. ఈ ప్రమాద వార్త తెలుసుకున్న పోలీసులు.. ఘటనా స్థలానికి చేరుకని సహాయక చర్యలు చేపట్టారు. 
 
మృతదేహాలను స్వాధీనం చేసుకుని గురజాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అలాగే, క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రులకు తరలించి వైద్యం అందించారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ జరుపుతున్నారు.