శుక్రవారం, 3 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By వరుణ్
Last Updated : గురువారం, 4 మే 2023 (11:11 IST)

క్రీడా వాహనాన్ని ఢీకొన్న ట్రక్కు.. చిన్నారులతో సహా 11 మంది మృతి

road accident
ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఒక క్రీడా వాహనాన్ని ట్రక్కు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఎస్.యూ.వీ వాహనంలో ప్రయాణిస్తున్న 11 మంది మృత్యువాతపడ్డారు. వీరిలో పలువురు చిన్నారులు కూడా ఉన్నారు. వీరంతా బంధువులు ఇంటిలో జరిగిన ఓ వివాహానికి హాజరయ్యేందుకు వెళుతూ ప్రమాదంబారినపడ్డారు. మృతుల్లో ఇద్దరు చిన్నారులు కూడా ఉన్నారు. 
 
ధామ్‌తరి జిల్లా సోరా - భట్‌గావ్ గ్రామానికి చెందిన కంకేర్ జిల్లా మర్కటోలా గ్రామంలోని తమ బంధువుల ఇంట జరిగే వివాహానికి స్పోర్ట్స్ యుటిలిటీ వాహనంలో వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. బుధవారం రాత్రి జాతీయ రహదారి 30పై పురూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జగార్తా గ్రామ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది.
 
ప్రమాదంలో మహీంద్రా బొలెరో వాహనంలో ప్రయాణిస్తున్న పది మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. తీవ్రంగా గాయపడిన చిన్నారి ఆస్పత్రికి తరలిస్తుండగా, మార్గమధ్యంలో చనిపోయింది. పురూర్ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.