గురువారం, 2 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 26 ఏప్రియల్ 2023 (15:50 IST)

మావోయిస్టుల ఘాతుకం.. 10 మంది పోలీసుల మృతి

blast
మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల్లో ఒకటైన ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులు మరోమారు పెట్రేగిపోయారు. ఈ రాష్ట్రంలోని దంతేవాడ జిల్లాలో పోలీసుల వాహనాన్ని పేల్చేశారు. దీంతో పది మంది పోలీసులు మృత్యువాతపడ్డారు. పోలీసుల వాహనాన్ని లక్ష్యంగా చేసుకుని మందుపాతర పేలుడు జరిపడంతో ఈ దారుణం జరిగింది. పోలీస్ వాహనం డ్రైవర్‌తో పాటు పది మంది పోలీసులు ప్రాణాలు కోల్పోయారు.
 
దంతేవాడ అడవుల్లో మావోయిస్టులు నక్కినట్లు నిఘా వర్గాల నుంచి సమాచారం రావడంతో బుధవారం పోలీసులు ప్రత్యేక ఆపరేషన్‌ చేపట్టారు. ఆ ఆపరేషన్‌ ముగించుకుని తిరిగి వస్తుండగా నక్సల్స్‌ ఈ దుశ్చర్యకు పాల్పడ్డారు. పోలీసుల వాహనం సమాచారాన్ని ఇన్ఫార్మర్ల ద్వారా తెలుసుకున్న మావోలు.. ఆ వాహనాన్ని లక్ష్యంగా చేసుకుని మందుపాతరతో పేల్చేశారు. దీంతో ఈ దారుణం జరిగింది. మృతుల్లో ఒక పౌరుడు కూడా ఉన్నట్టు సమాచారం.