ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 24 ఫిబ్రవరి 2023 (10:41 IST)

ఛత్తీస్‌గఢ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. 11మంది మృతి

road accident
ఛత్తీస్‌గఢ్‌లో గురువారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో 11మంది ప్రాణాలు కోల్పోయారు. తీవ్రగాయాలతో ప్రాణాలు కోల్పోయిన మృతులందరూ ఒకే కుటుంబానికి చెందిన వారని పోలీసులు తెలిపారు. 
 
ఓ ట్రక్కు పికప్ వ్యాన్‌ను ఢీకొట్టడంతో ఈ దుర్ఘటన జరిగినట్టు పోలీసులు చెప్పారు. ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. 
 
క్షతగాత్రులు, మృతదేహాలను ఆసుపత్రికి తరలించారు. ఓ కుటుంబ వేడుకకు హాజరై వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.