శనివారం, 24 ఫిబ్రవరి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 22 ఫిబ్రవరి 2023 (17:19 IST)

పార్వతీపురంలో ఘోరం - పెళ్ళికి తిరిగి వస్తూ అనంతలోకాలకు

road accident
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పార్వతీపురం మన్యం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కొమరాడ మండలం చోళపదం వద్ద ప్రయాణికులతో వెళుతున్న ఆటోను లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆరుగురు దుర్మరణం పాలయ్యారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. వీరిని సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరంతా పెళ్లికి వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ఘోరం జరిగింది. 
 
అయితే, ఈ ప్రమాదంలో చనిపోయివారి వివరాలు తెలియరాలేదు. ఈ ప్రమాద వార్త తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడ్డవారిని ఆసుపత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి సంబంధించి ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.