బుధవారం, 1 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 16 ఫిబ్రవరి 2023 (14:32 IST)

చౌటుప్పల్‌లో ఘోర రోడ్డు ప్రమాదం : నలుగురి మృతి

road accident
హైదరాబాద్ - విజయవాడ జాతీయ రహదారిపై గురువారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అమిత వేగంతో దూసుకొచ్చిన ప్రైవేటు బస్సు ఒకటి ఆటోను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటోలో ఉన్న నలుగురు ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు. మృతులంతా మహిళా కూలీలే కావడం గమనార్హం. ఈ ప్రమాదం కారణంగా భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ప్రమాదం వార్త తెలుసుకున్న పోలీసులు.. అక్కడకు చేరుకుని వాహన రాకపోకలను క్రమబద్ధీకరించారు. కాగా, మృతదేహాలను పోలీసులు స్వాధీనం చేసుకుని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. 
 
దండుమల్కాపురం ఇండస్ట్రియల్ పార్కు సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. దేవలమ్మ నాగారం నుంచి వస్తున్న ఆటోను అబ్దుల్లాపూర్ మెట్ వెళుతున్న ప్రైవేటు బస్సు బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వారిని 108 సిబ్బంది సాయంతో ఆస్పత్రి తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ నలుగురూ మృత్యువాతపడ్డారు. చనిపోయినవారిని డాకోజి నాలక్ష్మి, వరకాంతం అనసూయ, సిలివేరు ధనలక్ష్మి, దేవరపల్లి శిరీష్‌లుగా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.