బుధవారం, 1 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 16 ఫిబ్రవరి 2023 (13:11 IST)

పాకిస్థాన్‌‍లో ఆల్‌టైమ్ గరిష్టానికి పెట్రోల్ - గ్యాస్ ధరలు

petrol pump
పాకిస్థాన్ దేశంలో ఆల్‌టైమ్ గరిష్టానికి చేరుకున్నాయి. పెట్రోల్, గ్యాస్ విపరీతంగా పెరిగిపోతున్నాయి. పీకల్లోతు ఆర్థిక సంక్షోభంతో పాటు నానాటికీ పెరిగిపోతున్న ద్రవ్యోల్బణం పెరిగిపోతోంది. తాజాగా ఇంధన ధరలను మళ్లీ పెంచడంతో లీటర్ పెట్రోల్ ధర రికార్డు స్థాయిలో రూ.272కు చేరింది. 
 
పాకిస్థాన్ దేశంలో విదేశీ మారకద్రవ్య నిల్వలు రోజురోజుకూ అడుగంటి పోతున్నాయి. దీంతో విదేశీ నిధుల కోసం పాకిస్థాన్ చేయని ప్రయత్నమంటూ లేదు. ఈ క్రమంలో అంతర్జాతీయ ద్రవ్య నిధి ఆర్థిక సాయం అందించేందుకు ముందుకు వచ్చింది. అయితే, నిధుల విడుదలకు ఐఎంఎఫ్ విధించిన నిబంధనల మేరకు పాక్ ఈమారు పెట్రోల్ ధర ఏకంగా రూ.22.20కి మేరకు పెంచింది. 
 
పెట్రోల్‌తో పాటు డీజిల్ ధరలు కూడా పెంచడంతో లీటర్ రూ.280కు చేరుకుంది. లీటర్‌కి కిరోసిన్ ధర రూ.202.70కి చేరుకుంది. కొత్త ధరలు గురువారం నుంచి అమల్లోకి వస్తాయని ప్రభుత్వం పేర్కొంది. పాకిస్థాన్‌ను నిధుల విడుదల కోసం అంతర్జాతీయ ద్రవ్య నిధి, ఆర్థిక క్రమశిక్షణ పేరిట పాక్ ప్రభుత్వానికి పలు నిబంధనలు విధించింది. ఇందులో భాగంగా పాకిస్థాన్ ప్రభుత్వం ఇటీవల మినీ బడ్జెట్‌లో పన్నులను పెంచింది. ఈ యేడాది ప్రథమార్థంలో పాక్ ద్రవ్యోల్బణంగా గరిష్టంగా 33 శాతానికి చేరుకుని ఆపై గ్గడం ప్రారంభిస్తుందని అంచనా వేశారు.