శనివారం, 4 జనవరి 2025
  1. వార్తలు
  2. బిజినెస్
  3. సెన్సెక్స్
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 29 నవంబరు 2022 (17:16 IST)

లాభాలతో ముగిసిన బాంబే స్టాక్ మార్కెట్

BSE
బాంబే స్టాక్ మార్కెట్ లాభాలతో ముగిసింది. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఆల్ టైమ్ రికార్డులను నమోదు చేసుకున్నాయి.  ఈ క్రమంలో మంగళవారం ట్రేడింగ్ ముగిసే సమయానికి ఆల్ టైమ్ రికార్డులను నమోదు చేశాయి. 
 
ఇందులో భాగంగా బీఎస్ఈ ప్రధాన సూచీ 177 పాయింట్ల లాభాలతో 62,682కి పెరిగింది. అలాగే నిఫ్టీ 55 పాయింట్లు పుంజుకుని 18,618 పాయింట్ల వద్ద స్థిరపడింది.  
 
విదేశీ పెట్టుబడులు వెల్లువెత్తడంతో పాటు కీలక వడ్డీ రేట్లను అమెరికా ఫెడ్ రిజర్వ్ తగ్గిస్తుందనే అంచనాలతో మార్కెట్లలో జోష్ నెలకొంది. దీంతో భారత స్టాక్ మార్కెట్ ఆల్ టైమ్ రికార్డులను నమోదు చేసుకుంది.