గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 15 ఫిబ్రవరి 2023 (20:29 IST)

పెంపుడు కుక్కకు ట్విట్టర్ సీఈఓ బాధ్యతలు.. ఎలెన్ మస్క్

Twitter CEO
Twitter CEO
పెంపుడు కుక్కను ట్విట్టర్ సీఈఓ బాధ్యతలను అప్పగించారు .. టెస్లా అధినేత ఎలాన్ మస్క్. ట్విట్టర్‌ను సొంతం చేసుకున్నప్పటి నుంచి సంచలన నిర్ణయాలతో అందరికీ షాకిస్తున్న ఎలెన్ మస్క్.. తాజాగా.. ట్విట్టర్ సీఈఓగా తన పెంపుడు శునకం ఫ్లోకీని ప్రకటించాడు.
 
ట్విట్టర్ ఆఫీసులో సీఈఓ టీ షర్ట్ వేసుకొని ఉన్న కుక్క ఫొటోని ట్విట్టర్ అకౌంట్‌లో పోస్టు చేశాడు. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైరల్ అవుతోంది. 
 
ఫ్లోకీ ఇదివరకున్న ట్విట్టర్ సీఈఓ పరాగ్ అగర్వాల్ కంటే మెరుగ్గా పనిచేస్తుందని క్యాప్షన్ పెట్టాడు. దీనిపై స్పంధించిన నెటిజెన్స్ రకరకాలుగా.. ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు.