శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 11 జనవరి 2023 (23:09 IST)

అత్యధిక ఆస్తిని పోగొట్టుకున్న వ్యక్తిగా ఎలన్ మస్క్ గిన్నిస్ రికార్డ్

elon musk
ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడైన ఎలన్ మస్క్ తన ఆస్తుల్లో ఎక్కువ భాగాన్ని కోల్పోయి గిన్నిస్ రికార్డు సాధించాడు. తరచూ వివాదాలతో ప్రపంచ వ్యాప్తంగా పేరు తెచ్చుకున్న ప్రపంచంలోని అత్యంత ధనవంతుల్లో ఎలోన్ మస్క్ ఒకరు. ఇటీవల కూడా, సోషల్ నెట్‌వర్కింగ్ సైట్ ట్విట్టర్ కొనుగోలుతో మొదలైన మస్క్ కార్యకలాపాలు ప్రపంచవ్యాప్తంగా తీవ్ర విమర్శలకు కారణమయ్యాయి.
 
ట్విట్టర్‌ని కొనుగోలు చేసి, దాని కీలక ఎగ్జిక్యూటివ్‌లను తొలగించిన ఎలోన్ మస్క్, ఇప్పుడు ట్విట్టర్‌లో బ్లూటిక్ పొందడానికి ట్విట్టర్ డబ్బులు వసూలు చేస్తుంది. దీనిపై నెటిజన్లు మండిపడుతున్నారు. 
 
అయితే తాజాగా తన ఆస్తులు చాలా వరకు పోగొట్టుకుని గిన్నిస్ రికార్డు సృష్టించాడు. నవంబర్ 2021లో, అతని నికర విలువ 320 బిలియన్ డాలర్లు, కానీ ఇప్పుడు అది 137 బిలియన్ డాలర్లకు తగ్గింది. ఇది భారత విలువలో దాదాపు 15 లక్షల కోట్ల రూపాయలు. దీని ద్వారా అత్యధిక ఆస్తిని పోగొట్టుకున్న వ్యక్తిగా గిన్నిస్ రికార్డు సృష్టించాడు.