గురువారం, 19 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By వరుణ్
Last Updated : మంగళవారం, 15 నవంబరు 2022 (11:22 IST)

ఒక్కపూట భోజనానికే రూ.32,000 ఖర్చు : ఎలాన్ మస్క్

meals
ట్విట్టర్ అధినేత ఎలాన్ మస్క్ సంచలన విషయాలను బహిర్గతం చేస్తున్నారు. ట్విట్టర్‌ను భారీ మొత్తానికి కొనుగోలు చేసిన తర్వాత ఆయన ఉద్యోగుల సంక్షేమం కోసం ఖర్చు చేసే మొత్తం ఖర్చు వివరాలను వెల్లడించారు. తాజాగా ట్విట్టర్ ఉద్యోగులకు మధ్యాహ్నం భోజనం కోసమే రూ.32 వేలను ఖర్చు చేసినట్టు తెలిపారు. పనిలోపనిగా మరో 4400 మంది కాంట్రాక్ట్ ఉద్యోగులను ఆయన తొలగించారు. 
 
ఇప్పటివరకు ట్విట్టర్ ఉద్యోగులకు భోజనం ఉచితంగా అందిస్తున్నారు. 12 నెలల కాలానికి 400 మిలియన్ డాలర్లను ఖర్చు చేసినట్టు ఆయన వెల్లడించారు. అంటే ఒక్కో ఉద్యోగికి రోజుకు దాదాపుగా రూ.32000ను ఖర్చు చేసినట్టు వివరించారు. ముఖ్యంగా శాన్‌ఫ్రాన్సిస్కో ట్విట్టర్ ప్రధాన కార్యాలయంలో పనిచేసే తక్కువ మంది ఉద్యోగులకు ఎక్కువ విలువైన భోజనం అందించడాన్ని ఆయన హెలైట్ చేశారు. 
 
అయితే, ఎలాన్ మస్క్ తాజాగా విడుదల చేసిన ఈ వివరాలపై ఆ సంస్థ ఉద్యోగులు తీవ్రంగా మండిపడుతున్నారు. కొత్త యజమాని అన్ని అబద్దాలు చెబుతున్నారని ట్విట్టర్ మాజీ ఉద్యోగి ట్రసీ హాకిన్స్ మండిపడ్డారు. పైగా, ఎలాన్ మస్క్ నాయకత్వంలో పని చేయడం తమకు ఇష్టం లేదని తాను ఉద్యోగానికి రాజీనామా చేసినట్టు ఆయన తెలిపారు. ఈ ప్రోగ్రామ్‌ను తాను పర్యవేక్షించాని, ఒక ఉద్యోగికి రోజుకి సగటున ఆహారం కోసం 20 నుంచి 25 డాలర్ల మేరకు మాత్రమే ఖర్చు చేసినట్టు ఎలాన్ మస్క్‌కు సమాధానమిచ్చారు.