మంగళవారం, 26 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 15 ఫిబ్రవరి 2023 (07:21 IST)

నేడు కొండగట్టు అంజన్న క్షేత్రానికి సీఎం కేసీఆర్

kcrao
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు బుధవారం కొండగట్టు ఆంజనేయ స్వామి సన్నిధిలో పర్యటించనున్నారు. నిజానికి కొండగట్టుకు మంగళవారమే వెళ్లాలని నిర్ణయించారు. కానీ, మంగళవారం ఆలయ క్షేత్రానికి భక్తుల రద్దీ అధికంగా ఉంటుందని అధికారులు చెప్పడంతో ఆయన తన పర్యటనను బుధవారానికి వాయిదా వేసుకున్నారు. 
 
కాగా, ఈ పర్యటన కోసం సీఎం కేసీఆర్ బుధవారం ఉదయం 9 గంటలకు ప్రగతి భవన్ నుంచి బయలుదేరి, బేగంపేట విమానాశ్రయం నుంచి హెలికాఫ్టర్‌లో కొండగట్టుకు ఉదయం 9.40 గంటలకు చేరుకుంటారు. ఇందుకోసం కొడిమ్యాల మండలోని నాచుపల్లి జేఎన్టీయూ కాలేజీ హెలిప్యాడ్‌ ఏర్పాటు చేశారు. అక్కడ నుంచి ఆయన రోడ్డు మార్గంలో కొండగట్టు ఆలయానికి చేరుకుంటారు.
 
కాగా, తెలంగాణాలోని యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని ప్రభుత్వం అత్యంత  వైభవంతో పునర్ నిర్మించిన విషయం తెల్సిందే. అదే విధంగా కొండగట్టు అంజన్న ఆలయాన్ని కూడా తీర్చిదిద్దాలని సీఎం కేసీఆర్ సంకల్పించారు. ఇందుకోసం ఆయన రూ.100 కోట్లు కేటాయించారు. పైగా, యాదాద్రి డిజైన్లు ఇచ్చిన ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయికే కొండగట్టు బాధ్యతలను కూడా అప్పగించినట్టు సమాచారం. ఇందులోభాగంగా, ఆనంద్ సాయి ఇటీవల కొండగట్టు క్షేత్రంలో పర్యటించి అక్కడ పరిస్థితులపై అవగాహన పెంచుకునే ప్రయత్నం చేశారు.