బుధవారం, 6 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 10 ఫిబ్రవరి 2023 (16:23 IST)

ప్రపంచంలోనే అత్యంత పాపాత్ముడు : సినీ నటి కవిత

kavitha
ప్రపంచంలోనే అత్యంత పాపాత్ముడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అని భారతీయ జనతా పార్టీకి చెందిన మహిళా నేత, సినీ నటి కవిత అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత కేసీఆర్, ఆయన కుటుంబం మాత్రమే లాభపడిందని, తెలంగాణ ప్రజానీకం ఎప్పటిలా పేదలుగానే ఉన్నారని ఆరోపించారు. 
 
రాష్ట్రంలో కేసీఆర్ కుటుంబం, బీఆర్ఎస్ నేతలు మినహా ఎవరూ సంతోషంగా లేరన్నారు. రైతులు, ఉద్యోగులు, టీచర్లు, కౌలు రైతులు, కూలీలు ఎవరికీ సంతోషం లేదని అన్నారు. బతుకమ్మ పేరుతో కేసీఆర్ కూతురు కవిత రాజకీయాలు చేస్తున్నారని, రూ.3 కోట్లతో చీరుల కొని పంపిణీ చేస్తున్నారని మండిపడ్డారు. అది ఎవరు డబ్బు.. అని ప్రశ్నించారు. మెదక్ జిల్లా మండలం రాంపూర్‌లో జరిగిన బీజేపీ కార్యక్రమంలో ఆమె పాల్గొని పై వ్యాఖ్యలు చేశారు.