పర్వతారోహకురాలు ఆశా మాలవ్యకు అభినందనలు, కొంత నగదు సాయం
santosh gives money mountaineer Asha Malaviya
మహిళ భద్రత,సాధికారత ను సమాజంలోకి తీసుకువెళ్లాలన్న లక్ష్యం తో దేశవ్యాప్తంగా 25 వేల కిలోమీటర్ల సైకిల్ యాత్ర చేపట్టిన పర్వతారోహకురాలు ఆశా మాలవ్య తన యాత్ర హైదరాబాద్ చేరుకున్న సందర్భంగా జూబ్లీహిల్స్ జిహెచ్. ఏం సి. పార్క్ లో మొక్కలు నాటారు.
ఈ సందర్భంగా ఆశా మాలవ్య మాట్లాడుతూ గ్రీన్ ఇండియా చాలెంజ్ లో పాల్గొని మొక్కలు నాటడం ఆనందంగా ఉందని అన్నారు.పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలని కోరారు.తెలంగాణ ప్రభుత్వం మహిళ భద్రతకు,మహిళ సాధికారతకు చేపడుతున్న చర్యల పట్ల హర్షం వ్యక్తం చేశారు.గ్రీన్ఇండియా చాలెంజ్ చేపట్టిన ఎంపీ సంతోష్ కుమార్ కి ఆశా కృతజ్ఞతలు తెలియజేశారు.
తన సైకిల్ యాత్రలో భాగంగా ఎంపీ సంతోష్ కుమార్ ని ఆశా హైదరాబాద్ లో కలిసారు ఈ సందర్భంగా ఆశా ను ఎంపీ సంతోష్ కుమార్ అభినందించారు.తన వంతు సాయంగా కొంత నగదు సాయం అందించారు.భవిష్యత్ లో కూడా తన వంతు సహాయం అందిస్తానని భరోసా కల్పించారు.