గురువారం, 26 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : సోమవారం, 13 ఫిబ్రవరి 2023 (09:58 IST)

భోళా శంకర్‌ సెట్లో రాఘవేంద్రరావు ఎందుకు కలిశారో తెలుసా!

manoori
manoori
మెగాస్టార్‌ చిరంజీవి నటిస్తున్న భోళాశంకర్‌ చిత్రం షూటింగ్‌ హైదరాబాద్‌లోని మియాపూర్‌ సమీపంలోని అల్యూమినియం ఫ్యాక్టరీలో షూటింగ్‌ జరుగుతోంది. అక్కడ కొల్‌కత్తా బ్యాక్‌ డ్రాప్‌లో ఓ పాటను తీస్తున్నారు. చూడాలనుంది సినిమా కూడా కొల్‌కొత్తా బ్యాక్‌ డ్రాపే. కనుక అప్పటికీ ఇప్పటికీ నేను చిరంజీవికి విషెస్‌ చెప్పడానికి వెళ్ళినట్లు రాఘవేంద్రరావు తెలియజేశారు. అయితే అసలు కథ వేరుగా వుంది. 
 
bahlashyankar,keerti
bahlashyankar,keerti
అదేమిటంటే, సరిగ్గా ఫిబ్రవరి 11, 1978న మనవూరి పాండవులు కోసం చిరంజీవి కెమెరాముందుకు వచ్చింది మొదటిసారి. ఇప్పుడు 45 ఏళ్ళ సుధీర్ఘ కెరీర్‌. అందుకే చిరంజీవికి ఫిబ్రవరి 11,2023న  ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేయడానికి వచ్చినట్లు చిత్ర యూనిట్‌ చెబుతోంది. అప్పటికీ ఇప్పటికీ అదే శక్తి చిరంజీవిలో కనిపిస్తుందని ఆయన చిరుకి కితాబిచ్చారు.
 
అదేవిధంగా 12వతేదీన అంటే ఆదివారంనాడు అదే సెట్లో కీర్తి సురేష్‌ ప్రత్యక్షమైంది. ఆమె చిరంజీవికి చెల్లెలుగా నటిస్తోంది. ఈ సందర్భంగా చిరంజీవి కెరీర్‌ను విశ్లేషిస్తూ, మీరు నిజంగా మెగాస్టార్‌ అంటూ ట్వీట్‌ చేసింది. తమన్నా భాటియా నాయికగా నటిస్తున్న ఈ సినిమాను ఎ.కె. ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బేనర్‌పై అనిల్‌ సుంకర నిర్మిస్తున్నారు. మెహర్‌ రమేష్‌ దర్శకత్వం వహిస్తున్నారు.