బుధవారం, 28 ఫిబ్రవరి 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : శనివారం, 14 జనవరి 2023 (15:49 IST)

రాఘవేంద్ర రావు విడుదల చేసిన అలా నిన్ను చేరి ఫస్ట్‌లుక్‌ గ్లింప్స్

Raghavendra Rao, Kommalapati Sridhar, Maresh Sivan, Dinesh Tej
Raghavendra Rao, Kommalapati Sridhar, Maresh Sivan, Dinesh Tej
విజన్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై కొమ్మాలపాటి శ్రీధర్ సమర్పణలో  ‘అలా నిన్ను చేరి’  సినిమా రూపొందుతోంది. ఈ సినిమాతో మారేష్ శివన్ దర్శకుడిగా పరిచయం కాబోతున్నారు.  చిత్రంలో దినేష్ తేజ్, హెబ్బా పటేల్, పాయల్ రాధాకృష్ణ హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. కొమ్మాలపాటి సాయి సుధాకర్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.
 
ఓ వైపు షూటింగ్ చేస్తూనే మరోవైపు ప్రమోషన్స్ చేపడుతున్న చిత్రబృందం.. తాజాగా సంక్రాంతి కానుకగా దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు ఫస్ట్‌లుక్‌ గ్లింప్స్ రిలీజ్ చేశారు. ఫస్ట్ లుక్ లాంచ్ చేసిన అనంతరం చిత్ర యూనిట్ కి బెస్ట్ విషెస్ అందిస్తూ ఆల్ ది బెస్ట్ చెప్పారు రాఘవేంద్ర రావు.
 
ఫస్ట్‌లుక్‌ గ్లింప్స్ వీడియోలో లీడ్ క్యారెక్టర్ పోషిస్తున్న పాయల్, హెబ్బా పటేల్, దినేష్ తేజ్ నడుమ భావోద్వేగాలను చూడొచ్చు. హీరో దినేష్ తేజ్ రెండు డిఫరెంట్ గెటప్స్ లో కనిపించి ఆకట్టుకున్నారు. అతనితో హెబ్బా పటేల్, పాయల్ రాధాకృష్ణ రొమాంటిక్ రిలేషన్ హైలైట్ చేస్తూ ఈ వీడియో కట్ చేశారు. సుభాష్ ఆనంద్ తన ఆకర్షణీయమైన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌తో మెస్మరైజ్ చేశారు. 
 
కొత్త సంవత్సరం సందర్భంగా నిర్మాతలు ఈ సినిమా ఫస్ట్‌లుక్‌, మోషన్‌ పోస్టర్‌ని విడుదల చేయగా మంచి స్పందన వచ్చింది. ఈ అప్ డేట్స్ సినిమాపై పాజిటివ్ వైబ్స్ తీసుకొచ్చాయి. ఫీల్ గుడ్ లవ్ స్టోరీగా నేటితరం ఆడియన్స్ కోరుకునే అన్ని అంశాలతో రాబోతున్న ఈ సినిమా రిలీజ్ డేట్, ఇతర వివరాలు అతి త్వరలో ప్రకటించనున్నారు మేకర్స్. 
 
నటీనటులు: దినేష్ తేజ్, హెబ్బా పటేల్, పాయల్ రాధాకృష్ణ, శివకుమార్ రామచంద్రవరపు, శత్రు, కల్పలత, ‘రంగస్థలం’ మహేష్, ఝాన్సీ, కేదర్ శంకర్ తదితరులు.
 
కథ, స్క్రీన్‌ప్లే, డైలాగ్స్, దర్శకత్వం: మారేష్ శివన్
నిర్మాత: కొమ్మాలపాటి సాయి సుధాకర్
బ్యానర్: విజన్ మూవీ మేకర్స్
సమర్పకుడు: కొమ్మాలపాటి శ్రీధర్
ఎగ్జిగుటివ్ ప్రొడ్యూసర్: కర్నాటి రాంబాబు
DOP: ఐ ఆండ్రూ
సంగీతం: సుభాష్ ఆనంద్
ఎడిటర్: కోటగీటి వెంకటేశ్వరరావు
కళ: విఠల్
సాహిత్యం: చంద్రబోస్
ఫైట్స్: కింగ్ సోలమన్, రామకృష్ణ (ఆర్కే)
కొరియోగ్రఫీ: భాను
కాస్ట్యూమ్ డిజైనర్: మదాసర్ మహమ్మద్
పబ్లిసిటీ డిజైనర్: ధని ఏలే