శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : శనివారం, 31 డిశెంబరు 2022 (16:04 IST)

న్యూఇయర్‌ నాడు శ్రీలేఖ ఏంచేస్తుందో తెలుసా!

M.M. Srilekha
M.M. Srilekha
నటి, గాయని, సంగీత దర్శకురాలు ఎం.ఎం.శ్రీలేఖ డిసెంబర్‌ 31న తన కుటుంబంతోనే కలిసి కేక్‌ కట్‌చేసి ఆనందాన్ని పంచుకుంటున్నట్లు పేర్కొంది. తన కొడుకు తన భర్తతో కలిసి చిన్న కుటుంబంగా వున్న మా ఆనందాన్ని ఇలా వ్యక్తం చేసుకుంటారు. అసలు ఆమెకు డిసెంబర్‌ 31, జనవరి 1 కొత్త ఏడాది అనేవి జరుపుకోవడం ఇష్టం వుండదట. ఈ విషయాన్ని ఆమె ఇలా తెలియజేసింది.
 
ప్రతి ఏడాది సంగీత విభావరిలాంటివి వుంటాయి. ఈసారి లేవు. అందుకు ఇక్కడే కుటుంబంతో కలిసి వుంటాను. రాజమౌళి, కీరవాణి కుటుంబాలతో కలిసి ఆరోజు వుండడం సహజంగా ఇప్పటివరకు జరలేదు. ఎప్పుడైనా సందర్భం వస్తే అందరం కలుస్తాం. అయినా నాకు డిసెంబర్‌ 31, జనవరి 1అనే విషయంలో పెద్ద తేడా వుండదు. ప్రతిరోజూ మంచిరోజే. మంచి సినిమా హిట్‌ వస్తే అదే నాకు కొత్త ఏడాదితోనే సమానం. కొత్తగా పలు కథలు వింటున్నాం. త్వరలో మంచి ప్రకటన చేస్తాను అని తెలిపారు.