ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 30 డిశెంబరు 2022 (12:44 IST)

లక్ష్యాలు నిర్ధేశించుకుని వాటిని చేరుకునేందుకు ప్రయత్నించండి.. సమంత

samanta
కొత్త సంవత్సరంలో అడుగుపెట్టనున్న తన అభిమానులకు, సినీ ప్రేక్షకులకు హీరోయిన్ సమంత కీలక సూచనలు చేశారు. కొత్త సంవత్సరంలో కొన్ని లక్ష్యాలను నిర్దేశించుకుని వాటిని ఛేదించేందుకు కృషి చేయాలని కోరారు. అదేసమయంలో కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టకముందే నిర్ణయాలు తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైందని ఆమె తన ఇన్‌స్టా ఖాతాలో పోస్ట్ చేశారు. 
 
కొత్త లక్ష్యాలను నిర్ణయించుకుని కొత్త యేడాదిలో వాటిని సాధించేందుకు కష్టపడాలని సూచించారు. అయితే, లక్ష్యాలను నిర్ధేశించుకునే సమయంలో సాధ్యాసాధ్యాలను గమనించుకోవాలని సమంత సూచించారు. సులభమైన, మీరు చేయగలిగే లక్ష్యాలనే పెట్టుకోవాలని సూచిస్తూ, దేవుడు ఆశీస్సులు మీకెపుడూ ఉంటాలని తెలిపింది. కొత్త యేడాదిలో ముందస్తుగా మీకు శుభాకాంక్షలు అంటూ సమంత తన ఇన్‌స్టా ఖాతాలో పోస్ట్ చేశారు. 
 
కాగా, ఇటీవల యశోద చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సమంత.. ప్రస్తుతం విజయ్ దేవరకొండ హీరోగా రాబోతున్న ఖుషి చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా సాగుతోంది. మరోవైపు, తనకు సోకిన అరుదైన మయోసైటిస్ వ్యాధితో బాధపడుతున్న సమంత.. ఆ వ్యాధి నుంచి బయటపడేందుకు ఇంట్లోనే చికిత్స చేయించుకుంటున్నారు. అయితే, అనారోగ్యం నుంచి కోలుకున్న తర్వాతే ఖుషి షూటింగ్‌కు హాజరుకానున్నారు.