ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : గురువారం, 22 డిశెంబరు 2022 (18:38 IST)

అతిరథ మహారథుల సమక్షంలో సంతోషం OTT అవార్డ్స్ వేడుక

allu aravind, suresh and others
allu aravind, suresh and others
సంతోషం అదినేత, సినీ నిర్మాత, జర్నలిస్ట్ సురేష్ కొండేటి తెలుగు సినీ చరిత్రలో మరో సరికొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టారు. 21 ఏళ్లుగా సంతోషం సౌత్ ఇండియన్ ఫిల్మ్ అవార్డ్స్ అందిస్తూ వస్తున్న ఆయన... మొట్ట మొదటి సారిగా సంతోషం OTT అవార్డ్స్ ఒకటో ఎడిషన్ ఘనంగా హైదరాబాద్ లో నిర్వహించారు. అలాగే సంతోషం 21 సౌత్ ఇండియన్ ఫిల్మ్ అవార్డ్స్ కర్టెన్ రైజర్ కూడా ఘనంగా జరిగింది. ఈ వేడుకకు అతిరథ మహారథులు హాజరై ... సినిమాలు, వెబ్ సిరీస్ ల ద్వారా 2021,22 లకు గాను ప్రేక్షకులను అలరించిన నటి నటులు, టెక్నీషియన్స్ లను సంతోషంగా  అవార్డులతో సత్కరించారు.

rajendraprasad, ragavendrao
rajendraprasad, ragavendrao
ముందుగా 2021 కి సంబంధించిన విజేతల లిస్ట్ చూస్తే... బెస్ట్ వెబ్ సీరీస్ గా హాట్ స్టార్ లో ప్రసారం అయిన పరం పర నిలవగా... ఆ అవార్డును నిర్మాత శోభు యార్లగడ్డ అందుకున్నారు. బెస్ట్ యాక్టర్ అవార్డు సేనాపతి సినిమాకి గాను రాజేంద్ర ప్రసాద్ అందుకున్నారు. సినిమా బండి సినిమాకి గాను ప్రవీణ్ కండ్రేగుల అందుకున్నారు. బెస్ట్ డెబ్యూ డైరెక్టర్ గా ఒక చిన్న ఫ్యామిలీ కథ సీరీస్ కి మహేష్ ఉప్పల అందుకున్నారు. అలాగే 2022 కి సంబంధించిన అవార్డుల విషయానికి వస్తే బెస్ట్ విలన్ రెక్కీ సిరీస్ కి గాను సమ్మెట గాంధీ అందుకున్నారు.  బెస్ట్ వెబ్ సీరీస్ అవార్డును గాలివాన దక్కించుకోగా నిర్మాత శరత్ కుమార్ ఆ అవార్డును అందుకున్నారు. బెస్ట్ యాక్టర్ అవార్డును అహ నా పెళ్ళంట వెబ్ సీరీస్ కి రాజ్ తరుణ్ అందుకున్నారు. బెస్ట్ డైరెక్టర్ అవార్డ్ గాలివాన వెబ్ సీరీస్ కి శరణ్ కొప్పిశెట్టి అందుకున్నారు. బెస్ట్ ప్రొడ్యూసర్ అవార్డును అహా నా పెళ్ళంట వెబ్ సెరిస్ కి రాహుల్ తమడ, సాయి దీప్ అందుకున్నారు. బెస్ట్ సపోర్టింగ్ మేల్ అవార్డును గాలి వాన వెబ్ సీరీస్ కి సాయి కుమార్ అందుకున్నారు. అలాగే బెస్ట్ సపోర్టింగ్ ఫిమేల్ అవార్డు గాలి వాన వెబ్ సీరీస్ కి చాందిన చౌదరి అందుకోవల్సి ఉండగా... అదే సీరీస్ లో సావిత్రి పాత్ర పోషించిన మరో నటి అందుకున్నారు. బెస్ట్ పర్ఫార్మర్ ఫిమేల్ అవార్డును గాలివాన వెబ్ సీరీస్ కి రాధిక శరత్ కుమార్ ను వరించగా ప్రొడ్యూసర్ శరత్ పరార్ అందుకున్నారు. బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ గా 9 హవర్స్ సీరీస్ కి గాను శక్తి కాంత్ అవార్డు అందుకున్నారు. బెస్ట్ ఎడిటర్ అవార్డును గాలివాన వెబ్ సీరీస్ కి గాను సంతోష్ కామిరెడ్డి అందుకున్నారు. బెస్ట్ సినిమాటోగ్రఫీ అవార్డును 9 హౌర్స్ వెబ్ సీరీస్ కి మనోజ్ రెడ్డి అందుకున్నారు. ఇక ఈ వేదిక పై నటరాజ్ మాస్టర్ కొరియోగ్రఫీ చేసిన పాటలకు  బిగ్ బాస్ ఫేమ్ మానస్, విశ్వ, భాను శ్రీ, సోషల్ మీడియా స్టార్ భ్రమరాంబ స్టెప్పులు వేసి అలరించారు. ముందుగా సంతోషం ఓటీటీ కర్టెన్ రైజర్ విజయేంద్ర ప్రసాద్ చేతుల మీదుగా లాంఛ్ చేశారు. అలాగే 26వ తేదీన జరగబోతున్న సంతోషం గ్రాండ్ ఈవెంట్ కి సంబంధించిన కర్టెన్ రైజర్ ను ప్రొడ్యూసర్ అల్లు అరవింద్, శ్రీ లీల లాంచ్ చేశారు.
 
ఈ సందర్భంగా అల్లు అరవింద్ మాట్లాడుతూ... సంతోషం సురేష్ ఎందులోనైనా ముందుంటారు, ఆయన కోసమే వైజాగ్ లో బిజీగా ఉన్న నేను ఫ్లయిట్ లో వచ్చి మరీ వేడుకకు హాజరయ్యాను, ఓటీటీ ఎంటర్టైన్ మెంట్ స్పెస్‌లో మొదటి నుంచే అవార్డు ఫంక్షన్ చేసి.. అందులో ఉత్తమైనవి గుర్తించి.. ఓటీటీకి కూడా గుర్తింపు తీసుకురావాలనే సదుద్దేశంతో సురేశ్ ప్రారంభించారు. రేపు సినిమాకు ఎంత స్థానం ఉందో గ్రహించి.. ఇలా చేయడం సంతోషం. సురేష్ నిర్ణయాన్ని అభినందిస్తున్నా.
 
శ్రీలీల మాట్లాడుతూ... అందరికి నమస్కారం. సురేష్ గారికి థ్యాంక్యూ సో మచ్. నా ఫస్ట్ ఇంటర్వ్యూ కూడా సురేష్ గారితోనే. ఓటీటీ ఫ్లాట్ ఫాంకు కూడా అవార్డులు ఇవ్వడం సంతోషం. ఫస్ట్ టైం మన తెలుగులో స్టార్ట్ చేసినందుకు థ్యాంక్యూ.
 
ఈ సందర్భంగా విజయేద్రప్రసాద్ మాట్లాడుతూ... నేను రాసిన కథలకు సపోర్ట్ ఉంటుంది. కానీ ఓటీటీలో రచయితకు నిజమైన స్థానం దొరుకుంది. వారి రాసే కథలు చూస్తుంటే.. నాకు షివరింగ్ వస్తోంది. చాలా మంది అడిగారు నన్న ఓటీటీలకు రాయమని.. ఓటీటీల్లో రచయితకు అవార్డు వస్తే.. అది రియల్ సురేష్‌ గారికి కృతజ్ఞతలు’’అన్నారు.
 
ఈ సందర్భంగా సాయి కుమార్ మాట్లాడుతూ... థాంక్యూ సంతోషం. ఒక అద్భుతమైన ప్లాట్‌ఫాంను క్రియేట్ చేసినందుకు సురేష్‌కు కంగ్రాట్స్. అలాగే రాఘవేంద్రరావు గారి చేతుల మీదుగా అవార్డును తీసుకున్నందుకు సంతోషంగా ఉంది. నాన్నగారు ప్రతి సినిమా రాఘవేంద్రగారితో చేశారు. నేను ఫస్ట్ టైం వెబ్ సిరిస్ చేశాను. జీ5, డైరెక్టర్‌కు, ప్రోడ్యూసర్‌కు థ్యాంక్స్. ఫస్ట్ టైం రాధిక శరత్ కుమార్‌తో నటించాను. ఇది గొప్ప అనుభూతిని ఇచ్చింది. ఈ అవార్డును గాలివాన టీంకు అంకితం చేస్తున్నాను’’ అన్నారు.
 
మురళి మోహన్ మాట్లాడుతూ అందరికీ నమస్కారం, 25 ఏళ్ళ క్రితం చిన్న జర్నలిస్టుగా మొదలైన సురేష్ తరువాత సంతోషం అనే పత్రిక పెట్టి ఆరోజు నుంచి ఈరోజు వరకు నిరాటంకంగా అందచేస్తూ వస్తున్నారు. పెద్ద పెద్ద సంస్థలే చేతులు ఎత్తేసినా సురేష్ మాత్రం 25 ఏళ్లుగా మ్యాగజైన్ ను ఇవ్వడమే కాక సౌత్ ఇండియన్ అవార్డులు కూడా ఇవ్వడం అద్భుతం. మన సౌత్ ఇండియాలో సంతోషం మాత్రమే ఆరోజు నుంచి ఈరోజు వరకు నాలుగు భాషలకు అవార్డులు ఇస్తోంది. అంతటితో ఆగకుండా ఈ సంవత్సరం ఓటీటీ అవార్డులు ఇవ్వలని అనుకోవడాన్ని అభినందిస్తున్నా. మనిషి ఎదిగినా ఒదిగి ఉండే సురేష్ కొండేటి అనేక మందికి ఆదర్శం’’ అన్నారు.
 
రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ.. 45ఏళ్లుగా సినిమా ఇండస్ట్రీలో ఉన్నాను. యాక్టర్‌గా నేను ఎన్నో ఎక్సపర్ మెంట్స్ చేశాను. అన్ని కొత్త కొత్తవి చేశాను. ఈ జర్నీలో సినిమాలో వచ్చిన మార్పులో.. ఇవాళ సినిమా ఇంటికి వచ్చేసింది. కానీ మెగాస్టార్ చిరంజీవి కుమార్తె ఇంటికి వచ్చి.. ఓటీటీలో సినిమా చేస్తున్నా... మీరు చేయాలి అని అడిగింది. సినిమా పేరు సేనపతి అని చెప్పింది. నేను యాక్టింగ్ చేయడం ఏంటీ అనుకున్నా... ఆ సినిమా నేను చేశాను. కానీ ఓటీటీ ఇంత పేరు తీసుకువస్తుందని అనుకోలేదు.  యాక్టర్ అనే వాడికి ఏ ఫర్మాట్ అనే తేడా లేదని మీరు ఫ్రూవ్ చేశారు. కంటెంట్ ఉంటే... సినిమా హిట్ అని ఓటీటీ కూడా నిరూపించింది. ఓటీటీ ఫ్లాట్‌ఫాం కోసం అవార్డులు క్రియేట్ చేసిన సంతోషం సురేష్‌కు కృతజ్ఞతలు’ అన్నారు.
 
ఎస్వీ కృష్ణారెడ్డి మాట్లాడుతూ.. అందరి కంటే ముందు సంతోషం సురేష్ గారి గురించి చెప్పాలి. ఎన్ని చెప్పినా ఒకటి తక్కువ అవుతూనే ఉంటుంది. ఏదో ఒక మంచి పని 20ఏళ్లుగా చేస్తూనే ఉన్నారు. అందులో ఇప్పుడు కొత్తది ఏంటంటే.. ఓటీటీ అవార్డులు తీసుకువచ్చారు. ఆయన ప్రతి క్షణం కోసం.. సినీ పరిశ్రమ కోసం ఆలోచిస్తాడు. పరిశ్రమ అభివృద్ధి కోసం ఆకాంక్షిస్తాడు. అందుకోసం అనుక్షణం ప్రయత్నం చేస్తాడు. ఆయన పైస్థాయికి రావాలని.. ఇంకా ఎన్నో వేడుకలు జరపాలని కోరుకుంటున్నాను.’’ అన్నారు.
 
బెస్ట్ యాక్టర్‌కి గాను ఆహ నా పెళ్లంట వెబ్ సిరిస్‌కు రాజ్‌ తరుణ్‌కు అవార్డు లభించింది. ఈ సందర్భంగా రాజ్‌ తరుణ్‌ మాట్లాడుతూ... అందరికి నమస్కారం. సురేష్ గారికి థ్యాంక్యూ.  ఓటీటీ వాళ్లకు అవార్డులు ఇవ్వడం వల్ల వారికి ఉత్సహం కలుగుతుంది. నాకు ఫస్ట్ సినిమాకు వచ్చింది. ఇప్పుడు ఫస్ట్ సిరిస్‌కు వచ్చింది.  థ్యాంక్యూ వెరి మచ్.
 
ఇక ఈవెంట్ కు విశిష్ట అతిథిలుగా సీనియర్ యాక్టర్ మురళి మోహన్, సీనియర్ డైరెక్టర్లు రాఘవేంద్ర రావు, ఎస్వీ కృష్ణారెడ్డి, సీనియర్ ప్రొడ్యూసర్లు అల్లు అరవింద్, అచ్చిరెడ్డి, తుమ్మల రామసత్యనారాయణ, బెక్కెం వేణుగోపాల్ విచ్చేసి సంతోషం అవార్డులు అందుకున్న వారికి శుభాకాంక్షలు తెలిపారు. వీరు కాక సినీ పరిశ్రమకు చెందిన అనేక మంది సినీ నటులు, టెక్నీషియన్లు కూడా కార్యక్రమానికి హాజరయ్యారు.