ఇంతవరకు సరైన పేరు రాలేదని ఫీల్ అవుతున్నా : నిఖిల్ సిద్దార్థ్
హ్యాపీడేస్‌లో నలుగురిలో ఒకడిగా చేసిన నిఖిల్ సిద్దార్థ్ ఆ తర్వాత యువత సినిమాలో బాగా యూత్‌ను ఆకట్టుకున్నాడు. దాంతో ఆయన్ను చూసిన దర్శకుడు సుకుమార్ పిలిచి లక్ష రూపాయలు అడ్వాన్స్‌గా నిఖిల్‌కు ఇచ్చాడు. అప్పుడు చాలా హ్యాపీగా ఫీలయ్యాడు నిఖిల్. కానీ ఎందుకనో అది వర్కవుట్ కాలేదు. ఎట్టకేలకు 18 పేజెస్ సినిమాతో అది ఫలించింది. ఇందులో సుకుమార్ కథ, స్క్రీన్‌ప్లే సమకూర్చాడు. సినిమా ఎండిరగ్ ఊహించనివిధంగా వుంటుందని నిఖిల్ అంటున్నాడు.
ఇక రవితేజ జూనియర్‌గా పేరుతెచ్చుకున్న నిఖిల్.. ఈ సినిమా డబ్బింగ్ సమయంలో అనుకోకుండా రవితేజను కలిశాడు. రవితేజ తననుచూసి ఏయ్ నువ్వు డబ్బింగ్‌కు వచ్చావా అంటూ ఆప్యాయంగా పలుకరించి హగ్ చేసుకున్నారు. కీపిట్‌అప్ అంటూ ఎంకరేజ్ చేశారు. ఈ విషయాన్ని చాలా ఆనందంగా వ్యక్తం చేశాడు నిఖిల్. అయితే ఎన్నో సినిమాలు చేసినా ఇంతవరకు తగినంత పేరు రాలేదని ఫీల్ అవుతాను. 18 పేజెస్ సినిమాతో పాటు నా పెర్ ఫార్మెన్స్ కూడా మాట్లాడుకుంటారని అంటున్నాడు. కార్తికేయ2తో ఒక్కసారిగా పాన్ ఇండియా హీరో అనగానే ఒత్తిడికి గురయ్యాయని తెలియజేశాడు.