1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్

తెలంగాణ ప్రభుత్వ మాజీ సీఎస్ సోమేశ్ కుమార్ వీఆర్ఎస్ - సీఎం జగన్ ఆమోదం

somesh kumar
ఆంధ్రప్రదేశ్‌ కేడర్‌కు చెందిన సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి, తెలంగాణ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ స్వచ్ఛంద పదవీవిరమణ చేశారు. ఆయన వీఆర్ఎస్‌కు ఏపీ ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఆయన పెట్టుకున్న దరఖాస్తును సీఎం జగన్‌ ఆమోదించారు. 
 
ఇటీవల తెలంగాణ సీఎస్‌గా ఉన్న సోమేశ్ కుమార్ ఆంధ్రప్రదేశ్‌ కేడర్‌కు వెళ్లాలని తెలంగాణ హైకోర్టు ఆదేశించిన విషయం తెల్సిందే. ఆయనను ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి పదవి నుంచి తొలగించింది. దీంతో ఆయన గత నెల 12వ తేదీన అమరావతికి వచ్చి ఏపీ కేడర్‌లో రిపోర్టు చేసి, సీఎం జగన్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. 
 
ఆయన ఏపీ ప్రభుత్వానికి రిపోర్టు చేసి నెల రోజులు దాటుతున్నా ఇప్పటివరకూ పోస్టింగ్‌ ఇవ్వలేదు. సోమేశ్‌కుమార్‌ స్వచ్ఛంద పదవీవిరమణకు దరఖాస్తు చేసుకోవడమే దానికి కారణమని తెలిసింది. ఈ నేపథ్యంలో ఆయన వీఆర్ఎస్‌కు ప్రభుత్వం ఆమోదం తెలిపింది.