శనివారం, 24 ఫిబ్రవరి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 16 ఫిబ్రవరి 2023 (08:41 IST)

ప్రియురాళ్లను చంపిన ప్రియులు.. ఫ్రిజ్ బాక్సులో ఒకటి.. బెడ్ బాక్సులో ఒకటి..

deadbody
గతంలో ఢిల్లీలో శ్రద్ధా వాకర్ అనే యువతి దారుణ హత్య జరిగింది. ఆమెతో సహజీవనం చేసిన అఫ్తాబ్ అనే యువకుడే హత్య చేశాడు. ఆ తర్వాత శరీరానాన్ని ముక్కలు చేసి ఇంట్లోని రిఫ్రిజిటేర్‌లోనె దాచిపెట్టాడు. ఈ ఘటన మరచిపోకముదే తాజాగా మరో రెండు ఘోరాలు వెలుగు చూశాయి. సహజీవనం చేస్తున్న గాళ్‌ఫ్రెండ్‌ను ఓ యువకుడు హత్యచేసి ఫ్రిజ్‌లో కుక్కితే.. మరో వ్యక్తి, తన ప్రేయసిని చంపి బెడ్‌ బాక్స్‌లో దాచాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ దారుణ ఘటన వివరాలను పరిశీలిస్తే,
 
నిక్కీ యాదవ్‌ (23) అనే యువతి మృతదేహం రోడ్డు పక్కన ఓ దాబా ఫ్రిజ్‌లో కుక్కివున్న స్థితిలో లభ్యమవడం ఢిల్లీలో కలకలం రేపింది. ఆమెను బాయ్‌ఫ్రెండ్‌, 24 ఏళ్ల సాహిల్‌ గెహ్లోత్‌ హత్యచేసినట్లు పోలీసులు నిర్ధారించారు. తాను సహజీవనం చేస్తున్న బాయ్‌ఫ్రెండ్‌ గుట్టుగా మరో పెళ్లి చేసుకున్నాడని తెలిసి నిలదీయడంతో ఆమె మెడకు డేటా కేబుల్‌ వైర్‌ బిగించి చంపేశాడు. 
 
వీరిద్దరికీ కొన్నేళ్ల క్రితం ఓ వైద్య ప్రవేశ పరీక్ష సమయంలో పరిచయం ఏర్పడింది. అప్పటి నుంచే వీరిద్దరూ కలిసి సహజీవనం చేస్తున్నారు. ఫార్మా గ్రాడ్యుయేట్‌ అయిన సాహిల్‌ ఫిబ్రవరి 9న నిక్కీకి తెలియకుండా మరో యువతిని పెళ్లి చేసుకున్నాడు. ఇది నిక్కీకి తెలియడంతో అదే రోజు వెళ్లి సాహిల్‌ను ప్రశ్నించింది. ఈ విషయంమీద కార్లో వెళుతున్న ఇద్దరి మధ్య మాటామాటా పెరిగి తీవ్ర వాగ్వాదానికి దారితీసింది. 
 
ఈ స్థితిలో సాహిల్‌ ఓ డాటాకేబుల్‌ను నిక్కీ మెడకు గట్టిగా బిగించి హత్యచేశాడు. అనంతరం కారులో నుంచి మృతదేహాన్ని తన కుటుంబసభ్యులు నడుపుతున్న దాబా హోటల్‌కు తెచ్చి అక్కడ ఉన్న ఫ్రిజ్‌లో కుక్కాడు. నిక్కీ కనిపించకపోవడంతో ఆమె పొరుగు వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు సాహిల్‌ను పోలీసులు వలపన్ని పట్టుకున్నారు. నిక్కీని తానే హత్యచేసినట్లు విచారణలో సాహిల్‌ ఒప్పుకొన్నాడు. 
 
అలాగే, సాహిల్‌ తరహాలోనే మహారాష్ట్రలోని నలసోపార ప్రాంతంలో 30 ఏళ్ల హార్దిక్‌ షా అనే వ్యక్తి తన ప్రేయసిని చంపాడు. మేఘా తోర్వీ (40) మహిళ మృతదేహం ఓ ఫ్లాట్‌లోని బెడ్‌ బాక్స్‌లో లభ్యమైంది. ఆమె నర్సు. ఖాళీగా ఉండే హార్దిక్‌ షా, ఆమెతో కలిసి సహజీవం చేస్తున్నాడు. ఇద్దరూ 20 రోజుల క్రితమే భార్యాభర్తలం అని ఇంటి ఓనర్‌కు చెప్పుకొని ఫ్లాట్‌లో అద్దెకు దిగారు. ఒకరోజు హార్దిక్‌, కర్ణాటకలో ఉండే ఆమె పిన్నికి ఫోన్‌ చేసి.. తాను మేఘాను హత్యచేసినట్లు.. తాను ఆత్మహత్యచేసుకోనున్నట్లు చెప్పాడు. 
 
ఈ విషయాన్ని తనకు తెలిసిన వ్యక్తి ద్వారా మహారాష్ట్ర పోలీసులకు మేఘా పిన్ని ఫిర్యాదు చేయించింది. హార్దిక్‌ ప్లాట్‌కు వెళ్లి తలుపు పగులగొట్టిన పోలీసులకు బెడ్‌ బాక్స్‌లో మేఘా మృతదేహం లభించింది మధ్యప్రదేశ్‌లోని నాగ్డా రైల్వే స్టేషన్‌లో నిందితుడు హార్దిక్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ రెండు కేసులపై ఆయా ప్రాంతాలకు చెందిన పోలీసుల కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.