గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 14 మే 2023 (15:31 IST)

ఆటోను ఢీకొట్టిన ప్రైవేటు బస్సు - ఆరుగురి దుర్మరణం

road accident
ఏపీలోని కాకినాడ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కొంతమంది ప్రయాణకులతో వెళుతున్న ఆటోను ప్రైవేటు బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న వారిలో ఆరుగురు దుర్మరణం పాలయ్యారు. మరో నలుగురికి గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కాకినాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. 
 
అయితే, ఈ ప్రమాదంలో మరణించినవారందరూ మహిళలే కావడం గమనార్హం. వీరంతా ఓ రొయ్యల పరిశ్రమల పని చేసి తిరిగి ఇంటికి వెళుతుండగా ఈ ప్రమాదం జిల్లాలోని తాళ్లరేవు మండలం, సీతారామపురం సుబ్బరాయని దిబ్బ వద్ద జరిగింది. స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.