బుధవారం, 6 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్

ఏపీలో గర్భిణిలకు శుభవార్త చెప్పిన ప్రభుత్వం...

pragnant woman
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం గర్భిణీ మహిళలకు శుభవార్త చెప్పింది. అత్యాధునిక టార్గెటెడ్ ఇమేజింగ్ ఫర్ ఫీటల్ అనామలీస్ (టిఫా) స్కానింగ్ సేవలను ఉచితంగా అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ స్కాన్‌ను డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం కార్డు లబ్ధిదారులైన పేద, మధ్యతరగతి ప్రజలకు ఈ స్కానింగ్ పరీక్షలను ఉచితంగా చేయనున్నారు.
 
పుట్టబోయే బిడ్డ తల్లి గర్భంలోనే ఉన్న సమయంలో బిడ్డ ఆరోగ్యాన్ని, పిండం ఎదుగుదలలో లోపాలను గుర్తించడానికి ఉపయోగపడుతుంది. ఒక్టో టిఫా స్కాన్‌కు రూ.1100 నుంచి రూ.1500 వరకు వసూలు చేస్తుంటారు. అలాగే, అల్ట్రాసోనోగ్రామ్‌ స్కాన్‌కు రూ.250 చొప్పున ప్రభుత్వం ఖర్చు చేస్తుంది. గర్భం ధరించిన 18 నుంచి 22 వారాల గర్భస్థ దశలో ఈ స్కానింగ్ చేస్తారు. 
 
ఆరోగ్య శ్రీ నెట్‌వర్క్ ఆస్పత్రుల్లో లబ్దిదారులైన గర్భిణిలకు పై సమస్యలు ఉంటే వైద్యుల సూచన మేరకు ఒక టిఫా స్కాన్, రెండు అల్ట్రాసోనోగ్రామ్ పరీక్షలను ఉచితంగా నిర్వహించనున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను ఆన్‌లైన్‌లో పొందుపరిచామని తెలిపారు. ఎలా నమోదు చేయాలన్న విషయంపై నెట్‌వర్క్ ఆస్పత్రుల మెడికోలు, డేటా ఎంట్రీ ఆపరేటర్లకు శిక్షణ ఇచ్చామని, వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ లబ్ధిదారులైన మహిళలందరూ ఈ సేవలను వినియోగించుకోవాలని సూచించారు.