గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్

ది కేరళ స్టోరీస్ హీరోయిన్ ఆదాశర్మకు ప్రమాదం - ఆస్పత్రిలో అడ్మిట్

adah sharma
ఇటీవల విడుదలైన వివాదాస్పద చిత్రం "ది కేరళ స్టోరీస్". ఈ చిత్రంలో ప్రధాన పాత్రను పోషించిన హీరోయిన్ ఆదాశర్మకు, ఆ చిత్ర దర్శకుడు సుధీప్తో సేన్‌లు రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు. ముంబైలోని ఓ ప్రైవేటు కార్యక్రమానికి వెళుతుండగా వీరి ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైనట్టు తెలుస్తుంది. ఆ వెంటనే వీరిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. 
 
దీనిపై దర్శకుడు సుధీప్తో సేన్ స్పందిస్తూ, ఆదివారం సాయంత్రం కరీంనగర్‌లో జరిగే ఏక్తా యాత్రకు హాజరుకాలేకపోవడం బాధగా ఉందని తెలిపారు. అయితే, వీరి ప్రమాదానికి గల పూర్తి వివరాలు తెలియాల్సివుంది. కాగా, ఇటీవల విడుదలైన ది కేరళ స్టోరీస్ చిత్రం మంచి టాక్‌తో విజయవంతంగా ప్రదర్శితమవుతున్న విషయం తెల్సిందే.