ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 6 మే 2023 (17:03 IST)

కశ్మీర్ ఫైల్స్‌ను వెనక్కి నెట్టిన ది కేరళ స్టోరీ.. తొలిరోజే కుమ్మేసిందిగా..

the kerala story
లవ్ జిహాద్ పేరిట కేరళలో 32వేల మందికి పైగా అమాయక యువతులను ట్రాప్ చేసి ఐసిస్‌లో చేర్చారని చెప్తూ తీసిన "ది కేరళ స్టోరీ" సినిమా పలు వివాదాల మధ్య శుక్రవారం విడుదలైంది. ఆదా శర్మ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం పోస్టర్స్, ట్రైలర్ తోనే వివాదానికి కేంద్ర బిందువుగా మారింది. 
 
అయితే విడుదలైన తొలి రోజే కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఈ సినిమా మొదటి రోజు దేశవ్యాప్తంగా ఏడున్నర కోట్లు సాధించినట్టు తెలుస్తోంది. ఇంకా కలెక్షన్లు పెరిగే అవకాశం వుందని టాక్ వస్తోంది. చిన్న బడ్జెట్ తో నిర్మితమైన ఈ చిత్రం కశ్మీర్ ఫైల్స్ మాదిరిగా భారీ విజయం సొంతం చేసుకునే అవకాశం ఉందని సినీ పండితులు కూడా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. 
 
ఈ క్రమంలోనే తొలి రోజు రూ. 3.55 కోట్లు రాబట్టిన కాశ్మీర్ ఫైల్స్‌ను "ది కేరళ స్టోరీ" అధిగమించింది. కలెక్షన్ల పరంగా కేరళ స్టోరీ కశ్మీర్ ఫైల్స్‌ను వెనక్కి నెట్టిందని ట్రేడ్ వర్గాల సమాచారం.