బుధవారం, 22 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By వరుణ్
Last Updated : శుక్రవారం, 5 మే 2023 (10:18 IST)

సినిమాలపై స్టే విధించే విషయంలో ఆచితూచి వ్యవహరించాలి : సుప్రీంకోర్టు

supreme court
కోట్లాది రూపాయలు పెట్టుబడిగా పెట్టి తీసే సినిమాలపై స్టే విధించే విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ద కేరళ స్టోరీ సినిమా విడుదలకు కేంద్ర సెన్సార్ బోర్డు అనుమతి ఇచ్చింది. దీన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. దీనిపై ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ సారథ్యంలోని ధర్మాసనం విచారణ జరిపింది. 
 
ఈ సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి వ్యాఖ్యలు చేసింది. సినిమాల ప్రదర్శనపై స్టే విధించే సమయంలో న్యాయస్థానాలు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలని గురువారం సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ద కేరళ స్టోరీ సినిమాకు సీబీఎఫ్‌సీ జారీ చేసిన ధృవపత్రాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించింది.
 
'ఒక సినిమా విడుదలపై స్టే విధించే విషయంలో నిర్మాత కోణంలో చూడాలి. ఎన్నిసార్లు ఆయన సవాళ్లు ఎదుర్కొంటారు. అంతిమంగా ఎవరో ఒకరు డబ్బులు పెట్టుబడిగా పెడతారు. ఎంతో శ్రమపడి నటులు అంకితభావంతో నటిస్తారు. కాబట్టి సినిమాల విడుదలపై స్టే విధించడంలో మనం చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. సినిమా సరిగా లేకపోతే ఆ విషయాన్ని మార్కెట్ నిర్ణయిస్తుంది' అని అన్నారు. 
 
కాగా, కేరళలో వేల సంఖ్యలో యువతులను బలవంతంగా ముస్లిం మతంలోకి చేర్చినట్టు వారిని ఐసిస్ ఉగ్రముఠా ఉయోగించుకున్నట్టు ట్రైలర్‌లో చూపించారు. దీంతో ద కేరళ స్టోరీ సినిమా వివాదాస్పదమైంది. ఈ సినిమా విడుదలను పలు సంఘాలు, ముఖ్యంగా, సంస్థలు తీవ్రంగా వ్తి
 
కేరళలో వేల సంఖ్యలో హిందూ యువతులను బలవంతంగా ముస్లిం మతంలోకి చేర్చినట్లు.. వారిని ఐసిస్‌ ఉగ్రముఠా ఉపయోగించుకున్నట్లు ట్రైలర్‌లో చూపడంతో ‘ద కేరళ స్టోరీ’ సినిమా వివాదాస్పదమైంది. ఈ సినిమా విడుదలను పలు సంఘాలు, ముఖ్యంగా ముస్లిం సంస్థలు వ్యతిరేకిస్తున్నాయి. అంతకుముందు ఈ సినిమాపై దాఖలైన మరో రెండు పిటిషన్లను కూడా విచారించడానికి సుప్రీంకోర్టు తిరస్కరించింది.