'ది కేరళ స్టోరీ' సినిమాను చూడనున్న యోగి ఆదిత్యనాథ్
'ది కేరళ స్టోరీ' చిత్రం మే 5 నుంచి థియేటర్లలో ప్రదర్శనలు మొదలయ్యాక రాజకీయ రంగు పులుముకుంటోంది. తాజాగా యూపీ మంత్రివర్గంతోపాటు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మే 12న లఖ్ నవూలో ఈ చిత్రాన్ని ప్రత్యేకంగా వీక్షించనున్నట్లు ఆ రాష్ట్ర అధికారి చెప్పారు.
మరోవైపు.. సమాజంలో విద్వేషాలను రెచ్చగొట్టేలా ఈ సినిమా ఉందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో పూర్తిగా, తమిళనాడు రాష్ట్రంలోని మల్టీప్లెక్స్‌లో ఈ చిత్ర ప్రదర్శనలను ఇప్పటికే నిలిపివేశారు.
సమాజంలోని ఓ వర్గాన్ని కించపరిచేలా గతేడాది వచ్చిన 'ద కశ్మీర్ ఫైల్స్' మాదిరిగా 'బెంగాల్ ఫైల్స్' అంటూ మరో చిత్రాన్ని తెరకెక్కించే ప్రయత్నాలు జరుగుతున్నట్లు పేర్కొన్న బెంగాల్ సీఎం మమతా బెనర్జీ.. ఆ సినిమాకు భాజపా నిధులు సమకూరుస్తున్నట్లు ఆరోపించారు.