బుధవారం, 22 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: సోమవారం, 8 జనవరి 2024 (18:39 IST)

తిరుమలలో కొద్దిసేపు వర్షం మరికొద్దిసేపు పొగమంచు: వింత వాతావరణంతో భక్తులు గజగజ

tirumala rain
ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం తిరుమలలో వింత వాతావరణం చోటుచేసుకున్నది. సోమవారం నాడు కొద్దిసేపు భారీ వర్షం మరికొద్దిసేపు పొగమంచు కమ్ముకుంటూ భక్తులను గజగజ వణికిస్తున్నాయి. ఒకవైపు ఎదుటి వ్యక్తి కూడా కనిపించనంత పొగమంచు కురుస్తోంది. విపరీతమైన చలిగాలులు వీస్తున్నాయి. వీటికి తోడు వాతావరణంలో చోటుచేసుకున్న మార్పులు కారణంగా తిరుమలలో భారీ వర్షం కురుస్తోంది. దీనితో తిరుమల భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
 
తిరుమలేశునికి నటి సురేఖావాణి తలనీలాలు
టాలీవుడ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ సురేఖావాణి(surekhavani) తిరుమలేశునికి తలనీలాలు సమర్పించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. సోమవారం నాడు నడకదారిని వెళ్లి తిరుమలకు చేరుకున్న సురేఖావాణి తొలుత తలనీలాలు అర్పించి అనంతరం తన కుటుంబంతో కలిసి శ్రీవారిని దర్శించుకున్నారు. ఆలయం వెలుపలకి వచ్చాక ఆమెను గుర్తుపట్టిన అభిమానులు ఆమెతో ఫోటోలు దిగేందుకు ఉత్సాహం చూపించారు. అడిగినవారికి కాదనకుండా ఫోటోలకి ఫోజులిచ్చారు సురేఖావాణి.
 
సురేఖవాణి అవకాశం దొరికినప్పుడల్లా సోషల్ మీడియాలో తన అభిమానులను పలుకరిస్తుంటారు. ఏమైనా విషయాలు వుంటే పంచుకుంటూ వుంటారు. అప్పుడప్పుడు రీల్స్, డ్యాన్సులు చేస్తూ తన ఫ్యాన్సుకి హుషారెక్కిస్తుంటారు.