శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 6 జనవరి 2024 (11:42 IST)

రైలు భోగీలోనే మంటలు.. ఇద్దరు యువకుల అరెస్ట్

train
యూపీలో కదులుతున్న రైలులో చలి నుంచి తప్పించుకునేందుకు కొందరు ప్రయాణీకులు ట్రైన్ భోగీలోనే మంటలు వేశారు. ఇది తెలుసుకున్న సీఆర్పీఎఫ్ సిబ్బంది ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకున్నారు. అస్సాం నుంచి ఢిల్లీకి వెళ్తున్న సంపర్క్ క్రాంతి సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌ రైలులో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. 
 
జనరల్ కోచ్ కంపార్ట్‌మెంట్ నుంచి పొగలు రావడంతో ఆర్పీఎఫ్ సిబ్బంది అప్రమత్తమైంది. కానీ ట్రైన్ భోగీలో కాల్చుతున్న మంటల్ని చూసి పోలీసులు షాక్ అయ్యారు. మంటల్ని ఆర్పి భోగీలో మంటలేసిన యువకులను పోలీసులు అరెస్ట్ చేశారు. 
 
అయితే నిందితులిద్దరూ ఫరీదాబాద్ వాసులుగా పోలీసులు గుర్తించారు. కదులుతున్న రైలులో చలి విపరీతంగా ఉండడంతో మంటలు వేయాల్సి వచ్చిందని యువకులు తెలిపారు.