శనివారం, 4 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 16 డిశెంబరు 2023 (11:47 IST)

అత్యాచారం కేసు.. యూపీ ఎమ్మెల్యేకు 25 ఏళ్ల జైలు శిక్ష

మైనర్‌ బాలికపై అత్యాచారం కేసులో యూపీ గిరిజన నేత, ఎమ్మెల్యే రామ్‌దులారే గోండ్‌‌కు 25 ఏళ్ల కఠిన జైలు శిక్ష విధించారు. దీనికి తోడు రూ.10 లక్షల జరిమానా విధిస్తూ ఎంపీ-ఎంఎల్ఏ కోర్టు శుక్రవారంనాడు సంచలన తీర్పుచెప్పింది. 
 
2014లో ఆయనపై కేసు నమోదు కాగా, తొమ్మిదేళ్ల తర్వాత ఈ కేసులో తీర్పు వెలువడింది. 2014లో నవంబర్ 4న ఒక మైనర్ బాలికపై అత్యాచారం జరిపినట్టు ఆయనపై కేసు నమోదైంది. 
 
కాగా నిబంధనల ప్రకారం రెండేళ్లు, ఆపైన జైలు శిక్ష పడిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడుతుంది. ఆరేళ్ల పాటు ఎన్నికల్లో కూడా పోటీ చేయకూడదు.