1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
  4. This day that year: When Kapil's Devils created glory at 1983 World Cup

1983 క్రికెట్ ప్రపంచకప్‌.. ఆ మధుర క్షణానికి.. 36 ఏళ్లు

Kapil Dev
1983 క్రికెట్ ప్రపంచకప్‌లో పసికూనగా బరిలోకి దిగిన భారత్‌తో ఫైనల్‌ పోరుకు సిద్ధమైంది వెస్టిండీస్. విండీస్ జట్టుదే గెలుపని దాదాపు అందరూ నిశ్చయించుకున్నారు. టాస్‌ గెలిచిన క్లైవ్‌ లాయిడ్‌ భారత్‌కు బ్యాటింగ్ చేసే అవకాశం ఇచ్చాడు. 
 
విండీస్‌ బౌలర్ల ధాటికి భారత్‌ బ్యాట్స్‌మెన్ విలవిలలాడారు. దీంతో భారత్‌ 184 పరుగుల లక్ష్యాన్ని మాత్రమే విండీస్ ముందు ఉంచగలిగింది. ప్రపంచకప్ టైటిల్‌ విండీస్‌కే అని క్రికెట్ మేథావులందరూ ఒక నిర్ణయానికి వచ్చేసారు.
 
విండీస్ బ్యాటింగ్‌లో అద్భుతమైన ఓపెనర్లు అయిన గ్రీనిడ్జ్‌ (1), హేన్స్‌ (13)ను తక్కువ పరుగులకే కట్టడి చేశారు. అయినా అప్పటికీ ఫేవరేట్‌ విండీసే. దీనికి కారణం ప్రపంచ నంబర్‌ వన్‌ బ్యాట్స్‌మెన్‌ రిచర్డ్‌సన్‌ క్రీజ్‌లో ఉన్నాడు. మదన్‌లాల్‌ బౌలింగ్‌లో మిడ్‌వికెట్‌ మీదుగా అతడు భారీ షాట్‌ కొట్టాడు. కపిల్‌ వెనక్కి పరిగెడుతూ బౌండరీలైన్‌ సమీపంలో బంతిని ఒడిసి పట్టుకున్నాడు. 
 
ఒక్కసారిగా స్టేడియమంతా వందేమాతరం నినాదాలతో మార్మోగింది. ఇక భారత్‌ బౌలర్లు జోరు తగ్గకుండా నిప్పులు చెరిగే బంతులు విసురుతుంటే వెస్టిండీస్‌ జట్టు బ్యాటింగ్ లైనప్ పేకమేడలా కూలిపోయింది. లార్డ్స్‌ మైదానంలో టీమిండియా 43 పరుగుల తేడాతో అద్భుతమైన విజయం సాధించింది. ప్రపంచకప్‌ అందుకున్న తొలి భారత‌ కెప్టెన్‌గా కపిల్‌దేవ్‌ రికార్డు సృష్టించాడు. ఆ మధుర క్షణానికి నేడు సరిగ్గా 36 ఏళ్లు.
About Writer
కుమార్
తర్వాతి కథనం
ఈ నెల 28, 29 తేదీల్లో జీ-20 సదస్సు