శనివారం, 11 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By మోహన్
Last Updated : గురువారం, 16 మే 2019 (18:33 IST)

ప్రపంచకప్ 2019 షెడ్యూల్ చూసారా? ఓ సారి చూడండి మరి..

ప్రపంచకప్ 2019 పండుగకు సరిగ్గా 14 రోజులు మాత్రమే సమయం ఉంది! ఈ టోర్నీలో పది జట్లు తలపడుతున్నాయి. మే 30వ తేదీ నుంచి జూన్ 14 వరకూ ఇంగ్లండ్‌లోని పది మైదానాల్లో ఈ పోటీలు జరగనున్నాయి.


ఫైనల్ మాత్రం ప్రతిష్టాత్మకమైన లార్డ్స్ మైదానంలో జూన్ 14న నిర్వహిస్తారు. ఇప్పటికే అన్ని దేశాలు ప్రపంచ కప్ కోసం ప్రయాణ సన్నాహాలు మొదలు పెట్టేశాయి. 
 
ప్రపంచకప్ ఈనెల 30న ప్రారంభం అవుతున్నప్పటికీ, వార్మప్ మ్యాచ్‌లు ఈ నెల 24 నుంచే మొదలవనున్నాయి. పాకిస్థాన్ జట్టు ఆఫ్ఘనిస్తాన్‌తో, శ్రీలంక జట్టు దక్షిణాఫ్రికాతో తమ మొదటి వార్మప్ మ్యాచ్‌లు ఆడతాయి. 
 
ఇక భారత జట్టు న్యూజిలాండ్‌తో తమ మొదటి వార్మప్ మ్యాచ్‌లో ఈనెల 25వ తేదీన తలపడనుంది. కాగా ప్రపంచకప్ తొలి మ్యాచ్‌లో ఆతిథ్య జట్టు ఇంగ్లండ్ దక్షిణాఫ్రికాతో ఆడుతుంది. ఇండియా విషయానికి వస్తే ఈనెల 28వ తేదీన బంగ్లాదేశ్‌తో మొదటి మ్యాచ్‌లో పాల్గొంటుంది. ప్రపంచకప్ షెడ్యూల్‌ను మీరు ఓ సారి చూడండి.