1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
  4. This Video Of Sudha Murthy Has Gone Viral. And For All The Right Reasons

'ఇన్ఫోసిస్' సుధామూర్తి గొప్ప మనసు... స్వయంగా సరుకులను ప్యాక్ చేస్తూ.. (Video)

దేశ ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ సంస్థ సహ వ్యవస్థాపకుల్లో ఒకరైన డాక్టర్ నారాయణమూర్తి సతీమణి, ప్రముఖ సామాజిక కార్యకర్త సుధామూర్తి మరోమారు తనలోని గొప్ప మనసును చూపించారు. కేరళ వరద బాధితులను ఆదుకునేందుకు ఇన్ఫోసి

Sudha Murthy
దేశ ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ సంస్థ సహ వ్యవస్థాపకుల్లో ఒకరైన డాక్టర్ నారాయణమూర్తి సతీమణి, ప్రముఖ సామాజిక కార్యకర్త సుధామూర్తి మరోమారు తనలోని గొప్ప మనసును చూపించారు. కేరళ వరద బాధితులను ఆదుకునేందుకు ఇన్ఫోసిస్ ముందుకు వచ్చింది. ఆ సంస్థ తరపున వరద బాధితులకు వివిధ రకాల సహాయ సరుకులను అందజేస్తున్నారు.
 
ఈ సరుకుల ప్యాకింగ్‌ కూడా ఇన్ఫోసిస్ సిబ్బందే చేస్తున్నారు. వీరిలో ఒకరు సుధామూర్తి. సంస్థ ఉద్యోగులతో సుధామూర్తి కలిసిపోయి సరుకుల ప్యాకింగ్‌లో నిమగ్నమయ్యారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. 
 
సుధామూర్తి స్వయంగా సరుకులను ప్యాక్‌ చేయడంతోపాటు సంస్థ ఉద్యోగుల పనిని దగ్గరుండి పర్యవేక్షించారు. సామాన్లు సర్దుతున్న బృందంతో కూడా కలిసిపోయి వారికి తనవంతుగా సాయం అందించారు. 
 
సుధామూర్తి ఔదార్యాన్ని వీడియో తీసిన కేంద్రమంత్రి డీవీ సదానంద గౌడ ట్విటర్‌లో పోస్టు చేయడంతో వైరల్‌ అయింది. ఈ వీడియోను లక్షలాది మంది చూసి, సుధామూర్తి సేవాగుణాన్ని ప్రశంసిస్తున్నారు. అంతేకాదు అమ్మ అనే హ్యాష్ టాగ్‌తో షేర్ చేసుకుంటున్నారు.
 
About Writer
pnr
ఠాగూర్ పులపాక ప్రముఖ దినపత్రిక ఈనాడు, చెన్నై కార్యాలయంలో 'న్యూస్ కాంట్రిబ్యూటర్‌'గా జర్నలిజం ఓనమాలు నేర్చుకున్నారు. హైదరాబాద్ కార్యాలయంలో 'ఆంధ్రజ్యోతి' సబ్-ఎడిటర్ పని చేశారు. 2007 నుంచి 'వెబ్ దునియా'లో అసిస్టెంట్ ఎడిటర్‌‌గా విధులు నిర్వహిస్తున్నారు..... మరింత చదవండి
తర్వాతి కథనం
ముంబై క్రిస్టల్ అపార్ట్‌మెంట్‌లో అగ్నిప్రమాదం.. చిన్నారి 16 మందిని కాపాడింది!