శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By selvi
Last Updated : బుధవారం, 22 ఆగస్టు 2018 (14:06 IST)

వివాహితపై కన్నేశాడు.. అలా వీడియో తీసి మూడేళ్ల పాటు అత్యాచారం?

కామాంధుడు రెచ్చిపోయాడు. తనకు భార్య, ముగ్గురు పిల్లలు వున్నప్పటికీ మరో వివాహితపై కన్నేశాడు. వివాహిత స్నానం చేస్తుండగా, వీడియో తీసి.. ఆ వీడియోతో బ్లాక్ మెయిల్ చేశాడు. ఇలా బెదిరించి సదరు వివాహితపై గత మూడ

కామాంధుడు రెచ్చిపోయాడు. తనకు భార్య, ముగ్గురు పిల్లలు వున్నప్పటికీ మరో వివాహితపై కన్నేశాడు. వివాహిత స్నానం చేస్తుండగా, వీడియో తీసి.. ఆ వీడియోతో బ్లాక్ మెయిల్ చేశాడు. ఇలా బెదిరించి సదరు వివాహితపై గత మూడేళ్ల పాటు అత్యాచారానికి పాల్పడ్డాడు.


ఈ ఘటన రాచకొండ కమీషనరేట్ పరిధిలోని చౌటుప్పల్‌లో చోటుచేసుకుంది. అతడి వేధింపులు ఈ మధ్యకాలంలో మరీ ఎక్కువవడంతో తట్టుకోలేక వివాహిత పోలీసులను ఆశ్రయించింది. దీంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది.
 
వివరాల్లోకి వెళితే, యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ సమీపంలోని పీపల్ పహడ్ గ్రామంలో ఓ వివాహిత తన భర్త, ఇద్దరు పిల్లలతో కలిసి జీవిస్తోంది. అయితే అదే గ్రామానికి చెందిన ఉప్పుతోట రంగయ్య(45) అనే స్టోన్ కట్టింగ్ వర్కర్ ఈ వివాహితపై కన్నేశాడు. ఆమెను ఎలాగైనా లొంగదీసుకోవాలని భావించాడు. ఇందుకోసం సదరు వివాహిత స్నానం చేస్తుండగా రహస్యంగా ఈ దృశ్యాలను తన సెల్ ఫోన్‌లో చిత్రీకరించాడు. 
 
ఇక అప్పటి నుంచి ఆ మహిళకు నరకం చూపించాడు. తనకు లొంగనట్లైతే.. ఆమె భర్తతో పాటు గ్రామస్తులకు ఈ వీడియో చూపిస్తానని బ్లాక్ మెయిల్ చేయడం ప్రారంభించాడు. ఇలా బెదిరించి గత మూడేళ్లుగా ఆమెపై అత్యాచారానికి పాల్పడుతూ వస్తున్నాడు. అయితే అతడి వేధింపులు మరీ శృతిమించడంతో తట్టుకోలేక పోయిన వివాహిత పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. 
 
బాధితురాలి ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.