శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By selvi
Last Updated : బుధవారం, 22 ఆగస్టు 2018 (13:14 IST)

''జబర్దస్త్'' డైరక్టర్‌తో సమంత.. హిట్టా, ఫట్టా?

సమంత పెళ్ళికి తర్వాత హిట్ సినిమాల్లో నటిస్తోంది. పెళ్లికి తర్వాత ఆమెకు మంచి మంచి ఆఫర్లు వెల్లువెత్తుతున్నాయి. రాజుగారి గది 2, రంగస్థలం, మహానటి వంటి సినిమాలతో హిట్ కొట్టిన సమంత తాజాగా యూటర్న్ సినిమాతో

సమంత పెళ్ళికి తర్వాత హిట్ సినిమాల్లో నటిస్తోంది. పెళ్లికి తర్వాత ఆమెకు మంచి మంచి ఆఫర్లు వెల్లువెత్తుతున్నాయి. రాజుగారి గది 2, రంగస్థలం, మహానటి వంటి సినిమాలతో హిట్ కొట్టిన సమంత తాజాగా యూటర్న్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది. 
 
అలాగే తమిళంలో సీమరాజా సినిమా కూడా సెప్టెంబరులో రిలీజ్ కానుంది. యూటర్న్ తర్వాత.. సురేష్ ప్రొడక్షన్స్ పతాకంపై రూపుదిద్దుకునే సినిమాలో సమంత నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఇదో కొరియన్ మూవీ అని, ''మిస్ గ్రానీ'' అనే కొరియన్ సినిమాను తెలుగులోకి రీమేక్ చేస్తున్నట్టు తెలుస్తుంది.  
 
ఈ మూవీలో ఒక మహిళ జీవితంలోని వివిధ దశల్ని చూపిస్తారు. ఈ నేపథ్యంలో హీరోయిన్ 70 ఏళ్ల ముసలావిడగానూ సమంత కనిపిస్తుందని టాక్. ఈ సినిమాను లేడీ డైరెక్టర్ నందిని రెడ్డి తెరకెక్కిస్తున్నారు. గతంలో వీరి కాంబినేషన్‌లో ''జబర్దస్త్'' అనే మూవీ వచ్చి డిజాస్టర్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. నందిని రెడ్డి ''కళ్యాణ వైభోగమే'' తర్వాత రెండేళ్లకు పైగా ఖాళీగా ఉండిన ఈమె సమంతతో కొత్త ప్రాజెక్టును డీల్ చేయనుంది.