శనివారం, 4 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By selvi
Last Updated : శుక్రవారం, 17 ఆగస్టు 2018 (17:08 IST)

సమంత యూటర్న్ ట్రైలర్.. సమ్మూ వాయిస్ అతికిందా?

టాలీవుడ్ అగ్ర హీరోయిన్ సమంత ముఖ్య పాత్రలో నటించిన యూటర్న్ సినిమా ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాల్లో బిజీబిజీగా ఉంది. ఈ చిత్రంలో సమంత న్యూస్ రిపోర్టర్ పాత్రలో కనిపించబోతోంది. థ్రిల్లర్ ఎంటర్‌టైనర్‌గా

టాలీవుడ్ అగ్ర హీరోయిన్ సమంత ముఖ్య పాత్రలో నటించిన యూటర్న్ సినిమా ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాల్లో బిజీబిజీగా ఉంది. ఈ చిత్రంలో సమంత న్యూస్ రిపోర్టర్ పాత్రలో కనిపించబోతోంది. థ్రిల్లర్ ఎంటర్‌టైనర్‌గా ఈ మూవీ తెరకెక్కింది. పవన్ కుమార్ దర్శకత్వంలో ఈ మూవీ రూపొందింది. ఆది పినిశెట్టి పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్న ఈ చిత్రంలో భూమిక చావ్లా, రాహుల్ రవీంద్రన్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. 
 
శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై శ్రీనివాస్ చిట్టూరి ఈ సినిమాను నిర్మించారు. సెప్టెంబర్ 13వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా నుంచి ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. ప్రధాన పాత్రలను కవర్ చేస్తూ ఈ ట్రైల‌ను కట్ చేశారు. కథ అంతా కూడా ''ఆర్కే పురం'' ఫ్లై ఓవర్ పై జరిగిన యాక్సిడెంట్ చుట్టూ తిరుగుతుందనే విషయం ఈ ట్రైలర్ ద్వారా అర్థమవుతోంది. 
 
ఓ వైపున ఆ ప్రమాదం విషయంలో కొన్ని ఆధారాల కోసం సమంత ప్రయత్నిస్తూ వుంటుంది. మరో వైపున పోలీస్ ఆఫీసర్స్ ఆమెను అనుమానిస్తుంటారు. ఆసక్తికరమైన మలుపులు, ఉత్కంఠను రేకెత్తించే సన్నివేశాలతో కూడిన ఈ ట్రైలర్ అప్పుడే సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ట్రైలర్‌లో సమంత నటనపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. కానీ ఈ ట్రైలర్‌లో సమంత ఇచ్చుకున్న డబ్బింగ్ వాయిస్.. అంతగా పాత్రకు అతికినట్లు లేదని టాక్ వస్తోంది.