శనివారం, 28 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By selvi
Last Updated : మంగళవారం, 10 జులై 2018 (11:53 IST)

నువ్వా నేనా అంటూ పోటీ పడుతున్న సమంత-చైతూ..?

టాలీవుడ్ అందాల జంట సమంత, నాగచైతన్య ప్రస్తుతం పోటీ పడుతున్నారట. ఎందుకోసం అంటే హిట్ కోసం. తాము నటించే సినిమాల్లో ఏ సినిమాలు హిట్ అవుతాయోనని ఇద్దరూ పోటీపడి నటిస్తున్నారు. పెళ్లికి తర్వాత చెన్నై చిన్నది స

టాలీవుడ్ అందాల జంట సమంత, నాగచైతన్య ప్రస్తుతం పోటీ పడుతున్నారట. ఎందుకోసం అంటే హిట్ కోసం. తాము నటించే సినిమాల్లో ఏ సినిమాలు హిట్ అవుతాయోనని ఇద్దరూ పోటీపడి నటిస్తున్నారు. పెళ్లికి తర్వాత చెన్నై చిన్నది సమంతకు బాగా కలిసొచ్చింది. వరుసగా రంగస్థలం, మహానటి, అభిమన్యుడు సినిమాలతో సమంతా హిట్లు కొట్టింది.
 
సక్సెస్ ఫుల్ హీరోయిన్‌గా ఇటు టాలీవుడ్‌లో అటు కోలీవుడ్‌లో సమంతా సత్తా చాటుతోంది. మరోవైపు సమంతా హబ్బీ నాగచైతన్య మాత్రం ప్లాప్‌తో సతమతమవుతున్నాడు. హిట్లు లేకుండా కొట్టుమిట్టాడుతున్నాడు. గత ఏడాది సెప్టెంబరులో యుద్ధం శరణం సినిమా తర్వాత చైతూ సినిమా రాలేదు. కానీ ఈ ఏడాది మాత్రం డబుల్ ధమాకా కోసం చైతూ ఆసక్తితో ఎదురుచూస్తున్నాడు. 
 
చైతూ హీరోగా చందూ మొండేటి దర్శకత్వంలో రాబోతున్న సవ్యసాచి సినిమా ఆగస్టు 17న రిలీజ్ కానుంది. అలాగే డైరెక్టర్ మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న మరో సినిమా..''శైలజా రెడ్డి అల్లుడు'' కూడా జూలైలోనే రిలీజ్‌కి సిద్దమైంది. ఆగస్టు 31న శైలజా రెడ్డి అల్లుడు ప్రేక్షకుల ముందుకి రానుంది.
 
మరోవైపు సమంతా కూడా తమిళంలో మూడు సినిమాలతో బిజీగా ఉంది. ప్రస్తుతం సీమరాజ, సూపర్ డీలక్స్, యూటర్న్ సినిమాల్లో సమంతా హీరోయిన్‌గా నటిస్తోంది. తెలుగులో త్వరలోనే నాగచైతన్యతో కలిసి ఓ సినిమా చేయబోతుందని టాక్ వినిపిస్తోంది. మొత్తానికి ఏ మాయ చేసావె ప్రేమ జంట హిట్ల కోసం నువ్వా నేనా పోటీ పడుతుందట. సినిమాల పరంగా వృత్తి పరంగా పోటీ వుంటుందే కానీ భార్యాభర్తల మధ్య ఎలాంటి ఇగోలుండవని ఈ జంట స్పష్టం చేస్తోంది.