1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
  4. Viral Video: Man Suddenly Starts Kissing The bride on Wedding Stage

వరుడు చూస్తుండగానే వధువుకు ముద్దులెట్టిన యువకుడు

Viral Video
ప్రస్తుతం ఓ ఫన్నీ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్‌ హవా నడుస్తుండడంతో ఓ వివాహ వేడుకలో ఫన్నీ సంఘటన చోటుచేసుకుంది. వరుడు పక్కన ఉండగానే ఒక యువకుడు వధువు పక్కన కూర్చొని ఆమెకు ముద్దులు పెట్టడం ప్రారంభించాడు. ఇది చూడడానికి ఫన్నీగా కనిపిస్తున్న పెళ్లికొడుకు ముఖం చూస్తుంటే మాత్రం జాలి కలుగక తప్పదు.
 
వివరాల్లోకి వెళితే.. రిసెప్షన్‌ సందర్భంగా వరుడు, వధువు స్టేజీపై కూర్చొని ఉన్నారు. ఇంతలో ఒక యువకుడు వేదిక మీదకు వచ్చి ఇద్దరి మధ్యలో కూర్చుని వధువుకు ముద్దులు పెట్టడం మొదలుపెట్టాడు. ఈ ఘటనను చూసి అక్కడున్న వారందరూ షాకయ్యారు. ఆ వ్యక్తి తన భార్యను ఏం చేస్తున్నాడోనని పక్కనే ఉన్న వరుడు ఆసక్తిగా గమనించడం విశేషం. 
 
ఆ సమయంలో యువకుడు చర్యలకు వరుడు ముఖం పాలిపోవడం స్పష్టంగా కనిపించింది. అయితే పెళ్లికొడుకును ఏడిపించడానికే అమ్మాయి తరపు బంధువులు ఇలా ప్లాన్‌ చేసి ఉంటారని నెటిజన్లు భావిస్తున్నారు. నిరంజన్ మహాపాత్ర అనే వ్యక్తి ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు.
About Writer
సెల్వి