ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By సెల్వి
Last Updated : గురువారం, 3 అక్టోబరు 2024 (21:28 IST)

ప్రీ-వెడ్డింగ్ షూట్.. లిప్ లాక్‌తో రెచ్చిపోయిన జంట.. నెట్టింట విమర్శలు

Couple
Couple
సోషల్ మీడియాలో ఎన్నో వీడియోలు వైరల్ అవుతున్నాయి. తాజాగా ఓ ప్రీ-వెడ్డింగ్ వీడియో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. అంతేగాకుండా ఈ వీడియోపై పలువురు నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. ప్రీ-వెడ్డింగ్ పేరిట ఆ జంట రెచ్చిపోయి లిప్ లాక్ చేయడం ఇందుకు కారణం. 
 
ప్రీ-వెడ్డింగ్ షూట్ సమయంలో, ఒక జంట ఒకరితో ఒకరు పెదాలను లాక్ చేసుకోవడంతో ఈ వీడియో రికార్డ్ అయ్యింది. ఈ వీడియోలో ఆ జంట ప్రీ- వెడ్డింగ్ పేరిట పరిమితులను దాటింది.  ఆన్‌లైన్‌లో ఈ వీడియో ప్రీ-వెడ్డింగ్ జంటపై నెటిజన్లు ఖండిస్తున్నారు.  
 
అలాంటి చర్యలకు అనుమతించినందుకు చాలామంది ఆ జంటను, వారి కుటుంబాన్ని విమర్శిస్తున్నారు. ఇలాంటి అభ్యంతరకర ప్రీ వెడ్డింగ్ షూట్‌లు భారతీయ యువతపై పాశ్చాత్య సంస్కృతి ప్రభావాన్ని చూపుతున్నాయంటున్నారు. వ్యక్తిగత జీవితాలను ఇలా బహిరంగంగా పంచుకునే సోషల్ మీడియా సంస్కృతిపై కూడా విమర్శలు తప్పట్లేదు.