గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 19 సెప్టెంబరు 2024 (12:36 IST)

బోను తాళం పగలగొట్టుకొని మరీ బయటకు వచ్చిన పులి!!

Bengal tiger Abhimanyu
బోనులో బందీగా ఉన్న పులి తాళం పగలగొట్టుకొని మరీ బయటకు వచ్చింది. బోను నుంచి బయటకు వచ్చేందుకు ఆ పులిచేసిన చేష్టలను చూస్తే ప్రతి ఒక్కరూ ముక్కున వేలు వేసుకుంటారు. తాళంకప్పను నోట్లో పెట్టుకుని దానిని బలవంతంగా లాగింది. బోలు తలుపును కాలితో లాగి చూసింది. రాకపోవడంతో మరోమారు తాళంకప్పను నోటితో పట్టుకుని బలంగా లాగింది. ఆ తర్వాత తలుపు తీసుకుని దర్జాగా బయటకు వచ్చింది. అయితే, ఆ తాళం కప్పను పులే తనంత తానుగా బద్దలుగొట్టి బయటకు వచ్చిందా లేక ఎవరైనా సాయం చేశారా అన్న విషయంలో స్పష్టత లేదు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ వీడియోకు ఏకంగా 1.7 మిలియన్ వ్యూస్‌ రావడం గమనార్హం. 
 
ఈ వీడియోపై సోషల్ మీడియోలో విపరీతంగా చర్చ జరుగుతుంది. పులికి ఉన్న శక్తి చూస్తుంటే ఆశ్చర్యమనిపిస్తుందంటూ ఒక యూజర్ కామెంట్ చేస్తే, ప్రకృతిలో ఇంత బలముందా అని ఇంకో యూజర్ ఆశ్చర్యపోయాడు. పులులు ఎంత భయంకరమైనో మరోమారు తెలిసివచ్చిందంటూ మరో యూజర్ కామెంట్స్ చేశాడు. పులి బోనులో ఉంది కదా.. అని ఇకపై నిశ్చింతగా ఉండటానికి వీల్లేదని ఇంకో వ్యక్తి భయం వ్యక్తం చేశాడు. అసలు పులులను ఇలా చిన్నపాటి బోనులలో ఉంచాలనుకోవడమే మూర్ఖత్వమంటూ మరొకరు కామెంట్స్ చేశాడు.